Home వార్తలు ‘మట్కా’ నుంచి చిల్లా అప్పల రెడ్డిగా అజయ్ ఘోష్ ఫస్ట్ లుక్ 

‘మట్కా’ నుంచి చిల్లా అప్పల రెడ్డిగా అజయ్ ఘోష్ ఫస్ట్ లుక్ 

0

‘మట్కా’ నుంచి చిల్లా అప్పల రెడ్డిగా అజయ్ ఘోష్ ఫస్ట్ లుక్ 

న్యూస్ తెలుగు/ హైదరాబాద్ సినిమా : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’ నవంబర్ 14 న థియేటర్లలోకి రానుంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ఫస్ట్, సెకండ్ సింగిల్స్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి.

సినిమాలో ప్రతి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు, చిల్లా అప్పల రెడ్డి గా అజయ్ ఘోష్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కథలో అజయ్ ఘోష్ క్యారెక్టర్ చాలా కీలకంగా ఉండబోతోంది.

ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ ఇతర  కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం జివి ప్రకాష్ కుమార్ అందించగా, ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్.

తారాగణం: వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, సలోని, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు

సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్
నిర్మాతలు: డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి
బ్యానర్లు: వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: ఎ కిషోర్ కుమార్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
సీఈఓ: ఈవీవీ సతీష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్కే జానా, ప్రశాంత్ మండవ, సాగర్
కాస్ట్యూమ్స్: కిలారి లక్ష్మి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా (Story : ‘మట్కా’ నుంచి చిల్లా అప్పల రెడ్డిగా అజయ్ ఘోష్ ఫస్ట్ లుక్ )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version