వినుకొండలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు శిబిరానికి విశేష స్పందన
న్యూస్‌తెలుగు/వినుకొండ : ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు వినుకొండలో విశేష స్పందన లభిస్తోంది. శనివారం స్థానిక శివయ్య స్తూపం సెంటర్ లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు దరఖాస్తుల స్వీకరణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సన్నాహకంగా ఓటరు జాబితాల తయారీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గడువు నవంబర్ 6వ తేదీతో ముగుస్తుంది. స్థానిక శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శిబిరం ఏర్పాటు చేసి ఓటరు నమోదుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. పట్టభద్రులైన ప్రతి ఒక్కరు తమ ఓటును నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలంతా ఈ ప్రక్రియపై అవగాహన కల్పించి అర్హత ఉన్న వారందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలని సూచించారు. స్థానికంగా ఉంటున్న వారితో పాటు ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం బయట ఉంటు న్న వారికి కూడా ఈ విషయంపై అవగాహన కల్పించి ఓటర్లుగా నమోదు చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పఠాన్ ఆయూబ్ ఖాన్, సౌదాగర్ జానీబాషా, పీవీ సురేష్ బాబు, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి షమీమ్ ఖాన్, పత్తి పూర్ణచంద్రరావు, గట్టుపల్లి శ్రీనివాసరావు,శివశక్తి మేనేజర్ జీవి రమణారావు ,గోల్డ్ కరిమల్లా, తదితరులు పాల్గొన్నారు. (Story : వినుకొండలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు శిబిరానికి విశేష స్పందన)