అవినీతి ఆరోపణల కింద నలుగురు పోలీస్ అధికారులు సస్పెన్షన్
న్యూస్ తెలుగు/కొమరం భీo : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో గతంలో ఎస్సైగా విధులు నిర్వహించిన wsi సోనియా , మరియు అదే పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ASI R. మను. ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ ఉమేష్, రమేష్ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మల్టీ జోన్ వన్ ఐజి చంద్రశేఖర్ రెడ్డి గతంలో కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహించిన సోనియా ఒక కేసు విషయంలో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో జిల్లా ఎస్పీ డి.వి శ్రీనివాసరావు ఐ.పి.ఎస్ విచారణ జరిపి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మల్టీ జోన్-1 ఐజి చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నతమైన పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ అవినీతి పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు. (Story : అవినీతి ఆరోపణల కింద నలుగురు పోలీస్ అధికారులు సస్పెన్షన్)