కాల్షియం అధికంగా లభించే ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి
ఆర్థోపెడిక్ డాక్టర్ హేమంత్.
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : కాల్షియం అధికంగా లభించే ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకల సంబంధిత వ్యాధుల వల్ల కొంత నివారణ పొందవచ్చు అని ప్రముఖ బెంగళూరుకు చెందిన సాగర్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ డాక్టర్ హేమంత్, న్యూరో సర్జరీ నరేష్ కుమార్ తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి రెండవ నాల్గవ శనివారాల్లో అరగలే పోతన్న హాస్పిటల్ లో డాక్టర్ గణేష్, సాగర్ హాస్పిటల్ సంయుక్తంగా ఉచిత ఆర్థోపెడిక్ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం నిర్వహించిన ఉచిత ఆర్థోపెడిక్ శిబిరంలో భాగంగా డాక్టర్ మాట్లాడుతూ తమ దైనందిన జీవితంలో రోజురోజుకు సరైన ఆహారాన్ని తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ప్రధానంగా కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే ఎముకల్లోని సాంద్రత అధికంగా ఉంటుందన్నారు. అనంతరం సుమారు 100 మంది రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్య సలహాలతో పాటు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గణేష్, సాగర్ హాస్పిటల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ మునీంద్ర, పోతున్న హాస్పిటల్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (Story : కాల్షియం అధికంగా లభించే ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి)