Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌పాండురంగ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి టెండర్ ఆమోదం

పాండురంగ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి టెండర్ ఆమోదం

పాండురంగ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి టెండర్ ఆమోదం

మంత్రి గారి అభ్యర్థనను ఆమోదించి నిధులు విడుదల చేసిన దేవదాయ శాఖ

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని పాండురంగ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి టెండర్ ఆమోదించబడింది. పట్టణంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన పాండురంగ స్వామి ఆలయ పునర్నిర్మానం కోసం నిధులు మంజూరు చేయాల్సిందిగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ దేవాదాయ శాఖకు లేఖ రాశారు. సంబంధిత శాఖ వారు మంత్రిగారి లేఖకు స్పందిస్తూ టెండర్లను ఆహ్వానించగా అనంతపురం కు చెందిన ప్రభాకర్ రెడ్డి అనే కాంట్రాక్టర్ కు రూ. 1,05,32,880.92 కు ఆలయ పునర్నిర్మానానికి సంబంధించిన టెండర్ దక్కింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను దేవాదాయ శాఖ చీఫ్ ఇంజనీరు విడుదల చేశారు. ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని పాండురంగ స్వామి ఆలయ పునర్నిర్మాణం కోసం మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ గారు చొరవచూపి నిధులు విడుదల చేయించడం పట్ల ధర్మవరం పట్టణ ప్రజలు మంత్రికు కృతజ్ఞతలు తెలిపారు. (Story: పాండురంగ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి టెండర్ ఆమోదం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!