ప్రజారక్షణలో ఏటూరునాగారం పోలీసుల సేవలు
ఎస్ఐ తాజ్ ద్దీన్
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) : అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పోలీస్ ఫ్లాగ్ డే ” సందర్బంగా సంస్మరణ కార్యక్రమాలను శుక్రవారం ఏటూరు నాగారం పోలీసు ల ఆధ్వర్యంలో, ములుగు జిల్లా ఎస్పీ శబరిష్ ఆదేశాల మేరకు. సిఐ ఆనుమల శ్రీనివాస్, ఎస్సై తాజుద్దీన్ లు ఏటూరు నాగారం మండలంలోని రొయ్యూరు గ్రామంలో గ్రామ పెద్దలు, ప్రజలతో మమేకమై గ్రామసభ నిర్వహించారు. ఇట్టి గ్రామసభలో ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరిగిందని, ఏటూరునాగారం ఎస్ ఐ. తాజ్ ద్దీన్ తెలిపారు. ఈ సందర్బంగా ఎస్ ఐ తాజ్ ద్దీన్ మాట్లాడుతూ వికలాంగుడికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వీల్ చైర్ అందజేయనున్నట్లు తెలిపారు.
గ్రామంలో సైడ్ కాల్వల నిర్మాణం, పంచాయతీ ఎన్నికల తర్వాత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తామన్నారు. వృద్ధుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వృద్ధాపంలో తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేయకుండా వారి బాగోగులు చూసుకోవాలని అన్నారు. ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే పోలీస్ శాఖ వారిని సంప్రదించాలని, పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు . ప్రజల రక్షణ లో పోలీసుల సేవలు, పోలీసులు చేసిన ప్రతిభ, త్యాగాలు మొదలగునవి విషయాలను, ప్రజలకు తెలియజేయడం జరిగిందన్నారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏటూర్ నాగా రం, స్టూడెంట్స్ కు పదవ తరగతి., ఇంటర్మీడియట్ వరకు
విచక్షణతో కూడిన మొబైల్ వాడకంపై అవగాహన కల్పించారు. తెలంగాణను డ్రగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో డిగ్రీ కాలేజీ ఏటూరు నాగారం విద్యార్థులకు యువత కు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రేణుక, అధ్యాపకులు ,పోలీస్ అధికారులు, సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. (Story : ప్రజారక్షణలో ఏటూరునాగారం పోలీసుల సేవలు)