పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్థం విద్యార్థులకు ఓపెన్ హౌస్ నిర్వహణ
జిల్లా ఎస్పీ
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) : పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలో భాగంగా జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో ఓపెన్ హౌస్ కార్యక్రమన్ని నిర్వహించారు.
ములుగు టౌన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల విద్యార్థులు దాదాపు 350 మంది ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో నిష్ణాతులైన అర్మడ్ ఫోర్స్ అధికారులు సిబ్బంది స్వయంగా పిల్లలకు అన్ని రకాల ఆయుధాల గురించి, పోలీసు చట్టాల గురించి, డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ డివైస్, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనల గురించి , సైబర్ నేరాల గురించి వివరించారు. పోలీసులు రోజు వారి ఉపయోగిస్తున్న ఆయుధాలైన ఏకే 47, ఎస్ఎల్ఆర్, ఇన్సాస్, కార్బన్, 9యం యం పిస్టల్, బీడీ టీమ్, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్స్ తదితర విభాగాల వారీగా స్టాల్స్ ఏర్పాటు చేసి సంబంధిత అధికారులు సిబ్బంది విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా శబరిష్ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా దేశ భవిష్యత్తుకే పట్టుకొమ్మలాంటి విద్యార్థిని విద్యార్థులకు పోలీస్ వ్యవస్థ యొక్క పనితీరు,ప్రజల భద్రతకై పోలీసులు చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఈ యొక్క ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ములుగు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగినదని, విద్యార్థులకు ఆయుధాల పనితీరును రిజర్వుడ్ ఇన్స్పెక్టర్ హోదా గల అధికారులతో అవగాహనా కల్పించడం జరిగినదని తెలిపారు.ఈ యొక్క కార్యక్రమంలో ఆయుధాల ప్రదర్శన వాటి పనితీరు,బాంబు డిస్పాసల్ టీం, రియట్ గేర్ వంటి పరికరాలపై,శి టీమ్స్, భరోసా కేంద్రంలో మహిళ ల భద్రత కై పోలీసులు చేపడుతున్న కార్యక్రమాలను వివరించడం జారిగినదని విద్యార్థులకు వీటి పట్ల అవగాహన కలిగి ఉండడం అవసరమని విద్యార్థి దశలోనే మంచి చెడు తార తమ్యాలను వారికీ తెలియచేయడంలో ఇటువంటి కార్యక్రమాలు దోహదపడుతాయాని ఎస్పీ తెలియచేసారు.
తమ తల్లిదండ్రులు కన్న కళలను సాకారం చేయాలనీ దాని కోసం కస్టపడి చదివి ఉన్నత స్థాయి చేరుకోవాలని పేర్కొన్నారు.
గంజాయి డ్రగ్స్ ఇతర మాదక ద్రవ్యాల ను సేవించడం అమ్మడం న పరిగణించబడుతుందని మాదకద్రవ్యలను ఉపయోగిస్తే ఉజ్వల భవిష్యత్తును కోల్పోతారని తమ పరిసరాలలో ఎవరైనా గంజాయి వంటి మత్తు పదార్థాలు వాడుతున్నట్లు ఏదైనా సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీస్ వారికి లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని వారి వివరాలు గొప్యంగా ఉంచబడుతాయాన్నారు.
బాలికలు లేదా మహిళల భద్రత కై తెలంగాణ పోలీస్ వారు రూపొందించిన “టి సేఫ్” యాప్ ను తమ మొబైల్ లో ఉంచుకోవాలని., సైబర్ నేరాల బారిన పడకూడదని,,ఆ సంబంధిత లింకులను క్లిక్ చేయరాదని,సైబర్ మోసానికి గురి అయితే,వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు డయల్ చేయాలనీ ఎస్పీ వివరించారు.ఈ యొక్క కార్యక్రమంలో అదనపు ఎస్పి సదానందం ములుగు డీఎస్పీ రవీందర్, ములుగు సి ఐ శంకర్,ఆర్ ఐ అడ్మిన్ వెంకటనారాయణ, ఆర్ ఐ హోంగార్డ్స్ తిరుపతి రెడ్డి,ఎస్ ఐ ములుగు వెంకటేశ్వర్లు,ఆర్ ఎస్ ఐ లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.