ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జ్ లు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : సన్న రకం వరి ధాన్యాన్ని గుర్తించడంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జ్ లు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. గురువారం నాగవరంలోని రైతువేదికలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో పీపీసీ నిర్వాహకులకు సన్న రకం వరి ధాన్యం గుర్తించడం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సన్న రకం వరి ధాన్యాన్ని గుర్తించడంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జ్ లు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ సారి ప్రభుత్వం సన్నాలకు రూ. 500 బోనస్ కల్పిస్తున్న నేపథ్యంలో ధాన్యాన్ని గుర్తించడంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ డిజిటల్ గ్రేయిన్ కాలిబర్ మీటర్ ను తీసుకొని ధాన్యాన్ని గుర్తించడం నేర్చుకోవాలని చెప్పారు. ఏదేనా సెంటర్ నుంచి తప్పుగా ధాన్యాన్ని లోడ్ చేసినట్లు తెలీతే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అసలైన సన్నాలు వేసిన రైతులు నష్టపోకుండా జాగ్రత్తగా వ్యవహారించాలన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే ఏఈఓ లను సంప్రదించలన్నారు. వర్ష సమాచారంపై అప్రమత్తంగా ఉండి ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేయాలని పీపీసీ ఇంచార్జ్ లకు కలెక్టర్ ఆదేశించారు.
రేషన్ దుకాణం ఆకస్మిక తనిఖీ
జిల్లా కేంద్రంలోని కేడిఆర్ నగర్ లో ఉన్న 16వ నంబర్ రేషన్ దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్ దుకాణం లో సరుకులకు సంబందించిన రిజిస్టర్లు, బయోమెట్రిక్ సమయానికి లేకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈవీఎం గోదాం సాధారణ తనిఖీ
ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఉన్న ఈవీఎం గోదాంలో కలెక్టర్ సాధారణ తనిఖీ చేశారు. ప్రతీనెల చేసే తనిఖీల్లో భాగంగా ఆయన రెవెన్యూ అధికారులతో కలిసి సందర్శించారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ డిఎం ఇర్ఫాన్, డిసీఓ ప్రసాద రావు, డిసీఎస్ఓ కాశీ విశ్వనాధ్, డిఆర్డిఓ పీడీ ఉమాదేవి, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, ఆర్డివో పద్మావతి, తహసీల్దార్ రమేష్ రెడ్డి, ఏఈఓ లు, వ్యవసాయ శాఖ సిబ్బంది, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జ్ లు, ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. (Story : ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జ్ లు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి)