అనాధాశ్రమంలో అన్నదానం
గోరకాటి కుటుంబ సభ్యులు
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : మండల పరిధిలోని గోట్లురు గ్రామంలో గల వృద్ధుల అనాధాశ్రమంలో ఘోరకాటి పెద్దారెడ్డి, వీరి సతీమణి గోరకాటి పుల్లమ్మ వర్ధంతి సందర్భంగా గోరకాటి కుటుంబ సభ్యులు ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఇంటిలో జరిగే శుభ కార్యక్రమాలను ఈ విధంగా అనాధాశ్రమంలో నిర్వహించడంతో మానవతా విలువలు పెరుగుతాయని, మంచి తృప్తి సంతోషం కలిగిస్తాయని తెలిపారు. మున్ముందు ఆశ్రమమునకు మరింత సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అనంతరం ఆశ్రమ నిర్వాహకులు ప్రపుల్ల చంద్ర ఆశ్రమ సమస్యలను వివరిస్తూ, దాతలకు కృతజ్ఞతలను తెలియజేశా రు. ఈ కార్యక్రమంలో ఘోరకాటి రఘునాథరెడ్డి, ప్రమీల, మహేందర్ రెడ్డి, అంజి తదితరులు పాల్గొన్నారు. (Srory : అనాధాశ్రమంలో అన్నదానం)