గత ప్రభుత్వం ఐటిడిఏ లను నిర్వీర్యం చేసింది
న్యూస్ తెలుగు /సాలూరు : గత వైసిపి ప్రభుత్వం ఐటిడిఏ లను నిర్వీర్యం చేసి గిరిజనులను నిర్లక్ష్యం చేశారని. ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మంగళవారం విజయవాడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ట్రైబల్ వెల్ఫేర్ వర్కుషాప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మొదట ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆమె సభలో మాట్లాడుతూ గతంలో I.T.D.A లు నిర్వీర్యం అయిపోయాయని, సమస్యలతో వచ్చిన గిరిజనులను నిర్లక్ష్యం చేసారని తెలిపారు.
ఇప్పుడు I.T.D.A ద్వారా అభివృద్ధి జరుగుతుందని, అన్న కాంటీన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. 2000 గిరిజన గ్రామాలకు 1200 కోట్ల రూపాయల తో కనెక్టివిటీ రోడ్డులు CM మంజూరు చేసారని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గిరిజన తరుపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని అన్నారు.హాస్టల్లో పిల్లలకి కాస్మోటిక్ చార్జీలు, లాండ్రీ మరియు ఆరోగ్య సమస్యలు రాకుండా ఏ.ఎన్.ఎం లు కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు ప్రతి I.T.D.A లో జనరల్ బాడీ మీటింగ్ పెట్టి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. (Story : గత ప్రభుత్వం ఐటిడిఏ లను నిర్వీర్యం చేసింది)