కృష్ణారావు పాలెం లో పేకాట శిబిరంపై పోలీసుల దాడి
న్యూస్తెలుగు/చాట్రాయి : కృష్ణారావు పాలెం పేకాట శిబిరంపై దాడి చేసి 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చాట్రాయి ఎస్సై రామకృష్ణ తెలిపారు. సోమవారం నూజివీడు డిఎస్పి ప్రసాద్ ఆదేశాలపై నూజివీడు రూరల్ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో విశ్వనీయ వర్గాల సమాచారంతో తన సిబ్బందితో కలిసి కృష్ణారావు పాలెం లో పేకాట శిబిరాలు పై దాడులు నిర్వహించి 11 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఐదు మోటర్ సైకిల్లు మరియు 27,450 రూపాయలు స్వాధీనం చేసుకొని వారిపై చాట్రాయి పోలీస్ స్టేషన్ నందు కేసులు నమోదు చేసినట్లుగా చాట్రాయి పోలీస్ స్టేషన్ ఎస్ఐ రామకృష్ణ తెలియ చేసినారు. (Story : కృష్ణారావు పాలెం లో పేకాట శిబిరంపై పోలీసుల దాడి )