పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా పి.డి.ఎఫ్ అభ్యర్థిని గెలిపించుకుందాం – UTF
న్యూస్‌తెలుగు/వినుకొండ : రానున్న శాసనమండలి ఎన్నికలలో పట్టభద్రుల స్థానానికి పి.డి.ఎఫ్ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని యు.టి.ఎఫ్ జిల్లా అధ్యక్షులు పి. ప్రేమ్ కుమార్ తెలియజేశారు.
వినుకొండ యు.టి.ఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి ఎం. రవిబాబు అధ్యక్షతన ఐదు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు పి. ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చరిత్రలో పి.డి.ఎఫ్ ఎమ్మెల్సీల స్థానం ప్రత్యేకమైనదని, నిక్కచ్చిగా నిజాయితీగా ఉంటూ పట్టభద్రులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగుల సమస్యలు శాసనమండలిలో ప్రస్తావిస్తూ ప్రభుత్వాలకు విలువైన సూచనలు చేస్తూ శాసనమండలి గౌరవాన్ని మరింత పెంచారన్నారు. వివిధ రంగాల ప్రజల పోరాటాలను శాసనమండలిలో ప్రస్తావిస్తూ ప్రజల గొంతుగా నిలిచారన్నారు.
నవంబర్ ఆరవ తేదీ లోపు ఓట్లు నమోదు ప్రక్రియ ముగుస్తుందని ప్రతి గ్రాడ్యుయేట్ను ఓటరుగా చేర్పించడంలో ప్రతి యు.టి.ఎఫ్ కార్యకర్త పనిచేయాలన్నారు.
సి.ఐ.టి.యు జిల్లా అధ్యక్షులు హనుమంతు రెడ్డి మాట్లాడుతూ శాసనమండలిలో పట్టభద్రులకు ఉపాధ్యాయులకు మాత్రమే ప్రత్యేక స్థానాలు ఉన్నాయంటే ప్రజాస్వామ్యంలో వారి బాధ్యతను గుర్తించాలన్నారు. దశాబ్దాలుగా పి.డి.ఎఫ్ ఎమ్మెల్సీలు రాజకీయాలకు అతీతంగా ప్రజల పక్షం వహిస్తున్నారని నీతి నిజాయితీలకు మారుపేరుగా నిలిచారన్నారు. ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రజాసంఘాలు కూడా చేపడుతున్నాయని అన్నారు.
సమావేశంలో యు.టి.ఎఫ్ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ కె.వి.పి.ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ రాష్ట్ర యూనియన్ నాయకులు మాచర్ల బుజ్జి, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు మరియు యు.టి.ఎఫ్ నాయకులు వెంకటరెడ్డి, జిల్లాని, తిరుపతిరెడ్డి, మల్లికార్జున లింగయ్య, ప్రసాద్, రమేష్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. (Story : పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా పి.డి.ఎఫ్ అభ్యర్థిని గెలిపించుకుందాం – UTF)