Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ యన్ సి సి ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసిన సత్య కళాశాల ఆఫీసర్ ఉదయ్

యన్ సి సి ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసిన సత్య కళాశాల ఆఫీసర్ ఉదయ్

0

యన్ సి సి ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసిన సత్య కళాశాల ఆఫీసర్ ఉదయ్

న్యూస్‌తెలుగు/ విజయనగరం : సత్య డిగ్రీ& పిజి కళాశాల అధ్యాపకులు ముమ్మిడిశెట్టి ఉదయ కిరణ్ కి లెఫ్టినెంట్‌గా ర్యాంక్ అందజేశారు. సత్య డిగ్రీ& పిజి కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో అధ్యాపకుడైన ముమ్మిడిశెట్టి ఉదయ కిరణ్, ప్రీ-కమీషన్ (పి ర్ సి యన్ ) యన్ సి సి కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం లెఫ్టినెంట్గా ర్యాంక్‌ ఇచ్చారు.
మహారాష్ట్రలోని కంపీలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఓ టి ఎ )లో 85 రోజుల కఠినమైన శిక్షణ జరిగింది.
తన శిక్షణ సమయంలో, లెఫ్టినెంట్ ఉదయ కిరణ్ సెరిమోనియల్ డ్రిల్ విధానాలు, ఫిజికల్ ఫిట్‌నెస్ నియమాలు, ఫైరింగ్ మరియు వెపన్ హ్యాండ్లింగ్, మ్యాప్ రీడింగ్, నావిగేషన్ మరియు లీడర్‌షిప్ మరియు ,హెల్త్ అండ్ హీజిన్, పోసిషన్స్ ఆఫ్ ఫైరింగ్,టీమ్‌వర్క్ స్కిల్స్‌ను అభివృద్ధి చేయడంలో నైపుణ్యం సాధించాడు.
కళాశాల డైరక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు అభినందనలు తెలియజేశారు. ఎన్‌సిసి క్యాడెట్‌లకు మార్గదర్శకత్వం, స్ఫూర్తిని ఉదయ్ కిరణ్ తెలియజేయాలని ,అతని విలువైన అనుభవాన్ని , అంకితభావాన్ని ఎన్. సి.సి కాడెట్లకు తెలపాలని పేర్కొన్నారు. ముమ్మిడిశెట్టి ఉదయ కిరణ్ కి తమ అభినందనలు తెలిపారు.అతను ఎన్‌.సి.సిలో విజయవంతమైన మరియు రివార్డ్ కెరీర్‌గా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కెప్టెన్ యమ్ . సత్యవేణి: సత్య డిగ్రీ మరియు పి జి కళాశాలలో సీనియర్ యన్ సి సి అధికారిని, సూరపు నాయుడు: యన్ ఎస్ ఎస్ అధికారి,లెఫ్టినెంట్ ఉదయ కిరణ్‌కి అధ్యాపకులు మరియు ఎన్‌సిసి క్యాడెట్‌లు తమ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. (Story : యన్ సి సి ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసిన సత్య కళాశాల ఆఫీసర్ ఉదయ్ )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version