టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుని తల్లి మృతి
మోరంపూడి సంతాపం
న్యూస్‌తెలుగు/ చాట్రాయి : తెలుగుదేశం పార్టీ చాట్రాయి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కళ్ళేపల్లి ప్రబాకర్ తల్లి మృతి తీరని లోటని తెలుగు రైతు ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు కొనియాడారు. ఆదివారం చాట్రా యి మండలం,పర్వతాపురం గ్రామంలో కళ్ళేపల్లి ప్రభాకర్ మాతృమూర్తి కళ్ళేపల్లి భాగ్యమ్మ (75) అనారోగ్యం తో మరణించగా విషయం తెలిసిన వెంటనే మోరంపూడి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి భౌతిక వద్ద ఘన నివాళులర్పించారు. టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు బొర్రా నాగేశ్వర రావు, బూబత్తుల చెన్నారావు, చీపు మల్లేశ్వర రావు, బయగాని కళ్యాణ రావు, పిచ్చయ్య తదితరులు భాగ్యమ్మ మృత దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. (Story : టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుని తల్లి మృతి)