దేశ అభివృద్ధికి అందరూ కీలకపాత్ర వహించాలి
ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : దేశ అభివృద్ధికి యువతులు అందరూ కూడా కీలక పాత్ర వహిస్తూ అందరికీ ఆదర్శంగా ఉండాలని కె హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి, జాతీయ చేనేత నాయకురాలు జయశ్రీ, లయన్స్ క్లబ్ అధ్యక్షులు వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణములోని కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఢిల్లీ ఐఏఎస్ లక్ష్మయ్య అకాడమీ, సంస్కృతి స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా సివిల్స్ కోచింగ్ పై మహిళలకు ఉచితంగా శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డిగ్రీ పూర్తి చేసిన మహిళలకు ఉచిత ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఐఏఎస్ అకాడమీ లక్ష్మయ్య మాట్లాడుతూ మొత్తం 120 మందికి ఎగ్జామ్ పెట్టగా 25 మంది మహిళలు ఎంపిక కావడం జరిగిందని వీరందరికీ ఢిల్లీలో సివిల్ సర్వీస్కు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ జూమ్ మీటింగులో మాట్లాడుతూ తనను ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిని చేసిన నియోజకవర్గ ప్రజలకు ఏదైనా చేయాలన్న సంకల్పంతోనే సివిల్స్ కోచింగ్ పై మహిళలకు శిక్షణ ఇప్పించాలని నిర్ణయించుకోవడం జరిగిందని తెలిపారు. ఇందుకు సహకరించిన ఐఏఎస్ అకాడమీ ప్రతినిధులు లక్ష్మయ్య సంస్కృతి స్వచ్ఛంద సేవా రాష్ట్ర కార్యదర్శి వంటేరు శ్రీనివాసరెడ్డికి వారు కృతజ్ఞతలను తెలియజేశారు. భవిష్యత్తులో నియోజకవర్గ ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తానని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు కూడా పాల్గొన్నారు.(Story:దేశ అభివృద్ధికి అందరూ కీలకపాత్ర వహించాలి)