వరద బాదితులకు ప్రత్యేక వైద్య సేవలు
జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ నిధి మీనా
న్యూస్ తెలుగు/విజయవాడ : వరద ప్రభావిత ప్రాంతాల్లో వరద బాదితులకు ప్రత్యేక వైద్య సేవలు అందించనున్నట్లు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యలు, సెక్రటరీ ఎం.బబిత తెలిపారు. విజయవాడ అర్భన్ పరిదిలోని న్యూ వాంబే కాలనీ యూపీహెచ్‌సీలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ శనివారం అరోగ్య శాఖ సహాయంతో ఏర్పాటు చేసిన వైద్య శిభిరాన్ని న్యాయమూర్తులు బబిత, ఎ.సత్యానంద్ ప్రారంభించారు. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార స ంస్థ ఫ్యాట్రన్ ఇన్ చీప్ జస్టిస్ దీరజ్‌సింగ్ ఠాకూర్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మార్గనిర్ధేశంతో వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా వైద్యశాఖ అధికారులు, పోలీస్ శాఖ సహకారంతో శిభిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ శిభిరం ద్వారా వంద ప్రభావిత ప్రాంత ప్రజలకు కార్డియాలజీస్టుతో పాటు గైనకాలజిస్టు, చిన్న పిల్లల వైద్య నిపుణులు, కంటి వైద్య నిపుణులు, ఫిజీషియన్ తదితర వైద్య సేవలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రూ.3లక్షలలోపు వార్షిక ఆధాయం కలిగినవారు, మహిళలు, పిల్లలు, ఎస్టీ, ఎస్సీలు, వరద వంటి విపత్తు ప్రభావిత ప్రజలకు న్యాయ సలహా, సహాయం కోసం ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందుకు జిల్లా, రాష్ట్ర న్యాయసేవాదికార సంస్థలను సంప్రదించాలని, 15100 హెల్ప్‌లైన్ టోల్ ప్రీ నంబర్‌లో కూడా సంప్రదించవచ్చని తెలిపారు. డీఎంహెచ్‌వో డా.సుహాసిని మాట్లాడుతూ వాంబే కాలనీ వంటి వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్య అవసరాలు తీర్చేందుకు 63 రకాల వైద్య పరీక్షలు నిర్వహించటం జరుతుందన్నారు. ఈసీజి, ఏకో పరీక్షల నిర్వాహణకు కూడా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాదికార సంస్థ డిప్యూటీ సెక్రటరీ డా.అమర రంగేశ్వరరావు, సీఐ వెంకటేశ్వర్లు, డీపీఎంవో డా.నవీన్, డీపీవో మహేష్, అధికారులు పాల్గొన్నారు. (Story : వరద బాదితులకు ప్రత్యేక వైద్య సేవలు)