రోడ్డు మరమ్మత్తు పనులు చేపడుతున్న పోలీసులు
ఎస్సై తాజ్ ద్దీన్
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) : ఏటూరునాగారం మండల కేంద్రంలోని చెక్ పోస్ట్ నుండి ఐటిడిఏ కార్యాలయం మూల మలుపుల వరకు, జాతీయ ప్రధాన రహదారి అధ్వానంగా, గుంతల మయంగా మారడంతో, తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో , ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు, ఏటూరు నాగారం సిఐ అనుముల శ్రీనివాస్ సూచనల మేరకు, శుక్రవారం ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో. అద్వానంగా గుంతల అమాయమైన రోడ్డు మరమ్మత్తు పనులు కంకరతో,గుంతలు పూడ్చివేసిన్నట్లు ఏటూరు నాగారం ఎస్ తాజ్ ద్దీన్ తెలిపారు. రోడ్డు ప్రమద రహిత జిల్లాగా ఉంచడం కోసం పోలీసులు నిరంతరం కృషి చేస్తూ పోలీస్ లు మానవత్వం చాటున్నారు. ఈ సందర్బంగా ఎస్. ఐ మాట్లాడుతూ ఇప్పటికీ చాలాసార్లు రోడ్లపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో, ఇట్టి గుంతలను పూడ్చడం జరిగిందని, పోలీసు వారి సేవలను ప్రజలు ప్రజాస్వామిక వాదులు, గ్రామ పెద్దలు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (Story : రోడ్డు మరమ్మత్తు పనులు చేపడుతున్న పోలీసులు)