UA-35385725-1 UA-35385725-1

వైకాపాను భరించలేకనే ప్రజలు జగన్‌ను తరిమేశారు

వైకాపాను భరించలేకనే ప్రజలు జగన్‌ను తరిమేశారు

తెదేపా ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

న్యూస్‌తెలుగు/  వినుకొండ : ఇటీవల జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్‌ రెడ్డిని 151 నుంచి 11కి తెచ్చి అధికారం నుంచి తరిమేసిందే వైకాపా దోచుకో, పంచుకో, తినుకో భరించలేకనే అని తెలుగుదేశం పార్టీ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఎద్దేవా చేశారు. ఈ డీపీటీ మాఫియాకు అయిదేళ్లు నాయకుడు గా ఉండి, అది చాలక రాష్ట్రాన్ని రూ. 14లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన ఘనుడు ఇప్పుడు నీతు లు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కనిపిస్తోందని ధ్వజమెత్తారు. ఇసుకలో వేల కోట్లు, మద్యంలో లక్ష కోట్లు దోచుకుని ప్యాలెస్‌లు నింపుకున్న జగన్ ఏర్పడిన 6నెలలు కూడా పూర్తిగాని కూటమి ప్రభుత్వంపై దిగజారుడు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు 125 రోజుల్లో 125 విజయాలు గురించి మాట్లాడారన్నారు. చేసిన మంచి పనులు కూడా చెప్పుకోలేకపోతే ఎలా అని తమందరికీ మార్గనిర్దేశం చేసినట్లు తెలిపారు . అదే సమయంలో పూటకో అబద్ధం-రోజుకో కుట్ర చేస్తున్న జగన్, తెదేపా సభ్యత్వ నమోదు డ్రైవ్, పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం, . పారిశ్రామిక సూపర్ సిక్స్ పాలసీలతో రాష్ట్ర అభివృద్ధికి బాటలు, శాండ్, లిక్కర్ పాలసీలు- వైకాపా దుష్ప్రచారం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు- ఓటర్ల నమోదు, సాగునీటి సంఘాల ఎన్నికలకు సన్నాహాలు, తదితరాంశాలపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాప్రతినిధులు అందరికీ దిశానిర్థేశం చేశారని అన్నారు. అలానే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కూటమి ప్రభుత్వంపై చేసిన విమర్శలపై మండిపడ్డారు ఎమ్మెల్యే జీవీ. కప్పం కట్టనిదే రాష్ట్రంలో ఏ పని జరగట్లేదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన ఇంకా 2019-2024 జూన్‌ మధ్య కాలంలో ఆగిపోయినట్లున్నారని చురకలు వేశారు. రాష్ట్రంలో జే-బ్రాండ్‌లు, జే-టాక్స్‌లు పోయి 4నెలలు దాటిందని గుర్తించాలన్నారు. పేదల రక్తమాంసాలతో వ్యాపారం చేసిన రాక్షసుడు మద్యాన్ని నియంత్రించా, పేదలకు మేలు చేయగలిగా అని ఎలా అలవోకగా అబద్ధాలు వల్లెవేస్తారని ప్రశ్నించారు. అతడి నాసిరకం మద్యం కారణంగా 30వేలమంది అక్కచెల్లెమ్మల తాళిబొట్లు తెగిపోయాయని, ఇప్పుడు గాలి విమర్శల తో ఆ పాపం నుంచి తప్పించుకోవాలని చూ‌స్తున్నారా అని మండిపడ్డారు. ఇకశాంతిభద్రతలపై అయితే జగన్‌కు మాట్లాడే అర్హతే లేదన్నారు. దాడులు, బూతులు అయిదేళ్ల పాటు ప్రజల్ని ఏ స్థాయిలో భయభ్రాంతులకు గురి చేశారో అప్పుడే మరిచిపోయారా అన్నారు. అలాంటి పరిస్థితు ల నుంచి వస్తునే అయిదు సంతకాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. (Story : వైకాపాను భరించలేకనే ప్రజలు జగన్‌ను తరిమేశారు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1