వాల్మీకి మహర్షి చిత్ర పాఠానికి ఘననివాళులు
జిల్లా కలెక్టర్ది వాకర టి ఎస్.
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) : వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా గురువారం కలెక్టరేట్ కార్యాలయంలోజిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ ఆయన చిత్ర ఫటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ దినం జాతిని గుర్తుంచుకునే రోజు, ప్రపంచం ఉన్నంత వరకు రామాయణం, వాల్మీకి చరిత్ర ఉంటుందని, ఇతిహాసాల్లో మొదటిది రామాయణం, పెద్దది మహాభారతం. అలాంటి రామాయణాన్ని రచించింది ఒక బోయ కులానికి చెందిన చోరుడు అయిన వాల్మీకి. ఈయన ఇచ్చిన స్ఫూర్తితో అనేక మంది రచయితలుగా, కవులుగా మారారని అన్నారు. ఇతిహాసాలోని సారాంశాలను ఈ తరం పిల్లలకు అర్థమయ్యే విధంగా పాఠశాల కరికులంలో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇలాంటి గొప్ప వారి చరిత్రల గురించి తెలుసుకోవడం నేటి తరానికి చాలా అవసరమని అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, డి పి ఆర్ ఓ రఫిక్, కలెక్టరేట్ కార్యాలయ సూపరింటెండెంట్లు మహేశ్ బాబు, శివకుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (Story :వాల్మీకి మహర్షి చిత్ర పాఠానికి ఘననివాళులు )