రతన్ టాటా భారతదేశానికి ఆదర్శప్రాయులు
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : రతన్ టాటా భారతదేశానికి ఆదర్శప్రాయులు అని ఆదర్శ సేవా సంఘం అధ్యక్షులు భీమిశెట్టి కృష్ణమూర్తి, గౌరవ అధ్యక్షులు చెన్న ప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పిఆర్టి వీధిలో గల ఆదర్శ పార్కులో ఆదర్శ సేవా సంఘం తరఫున రతన్ టాటా సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కొవ్వొత్తితో కూడా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రతన్ టాటా ఒంటరిగా వచ్చి కొన్ని కోట్ల మంది హృదయాలను సొంతం చేసుకున్నారని తెలిపారు. దేశం కోసం తన మొత్తం ఆస్తిని ఇస్తాను అన్న మహానుభావుడని, ఈ రోజుల్లో ఒక మనిషికి సహాయం చేయడమే గొప్ప అలాంటిది ఏ స్వార్థం లేకుండా టాటా గ్రూపు నుండి దాదాపు 60 నుండి 65 శాతము స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వడం ఒక గొప్ప వరము అని తెలిపారు. నేడు భారతదేశం ఒక గొప్ప మహానుభావుడిని కోల్పోవడం బాధాకరమని తెలిపారు. అనంతరం రతన్ టాటా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధన చేశారు. తదుపరి అబ్దుల్ కలాం జయంతి వేడుకలను కూడా ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అబ్దుల్ కలాం ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని తెలిపారు. అబ్దుల్ కలాం నిరాడంబరుడు,బాలల మనస్తత్వం కలిగిన భారతీయ శాస్త్రవేత్త అని ప్రపంచ గుర్తింపు పొందిన గొప్ప నాయకుడు అబ్దుల్ కలాం అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గుద్దిటీ నాగార్జున, నాగభూషణం, అడ్వకేట్ హేమ్ కుమార్, మాజీ సైనిక ఉద్యోగులు, తదితర సభ్యులు పాల్గొన్నారు.(Story:రతన్ టాటా భారతదేశానికి ఆదర్శప్రాయులు.)