తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు
మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర
న్యూస్ తెలుగు /సాలూరు : సూపర్ సిక్స్ పథకాలు తో తెలుగుదేశం పార్టీ తప్పుడామిలిచ్చి అధికారంలోకి వచ్చారని . అధికారంలోకి వచ్చిన నాలుగు ఐదు నెలలైనా ఒక్క హామీ కూడా అమలు చేయని పనికిమాలిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర అన్నారు. మంగళవారం ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యవసర వస్తువుల ధరలు పెరగడం వలన సామాన్య మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వం లో నేను మంజూరు చేయించిన పనులనే ఈ ప్రభుత్వం శంకుస్థాపనలు చేయడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. పల్లె పండుగ వలన ప్రజాధనం దుర్వినియోగం తప్ప పల్లె ల్లో ఎటువంటి ప్రగతి ఉండదని పల్లె పండుగ దండగ అని అన్నారు. అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే సాలూరు పట్టణంలో మరుగుదొడ్లు తాగునీరు ఇంటింటికి ఇస్తామని గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వాగ్దానం ఇచ్చి అధికారం లో కి వచ్చిన తర్వాత ఒక్క పని అయినా పూర్తి చేశార అని ప్రశ్నించారు.మాటల గారడీతో ప్రజలను మోసం చేయడం తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు. ఈ ప్రభుత్వంలో శాండు. ల్యాండ్. మైన్. వైను. మాఫియాగా తయారయ్యారని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగు వాటిల్లో తెలుగుదేశం నాయకులు కుటమీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు లాభం పొందుతున్నారన్నారు గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు సంక్షేమ పథకాల అందలేదని టిడిపి నాయకులు గగ్గోలు పెట్టారని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల కు ఎస్సీ ఎస్టీలకు ఒక్క పథకమైనా అందిందా అని టిడిపి నాయకులు ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో అప్పటి సీఎం ఫోటో ఉందని రైతులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఇప్పుడు భూములు సర్వే చేస్తామని చెప్పి వన్ బి మీద రెవిన్యూ శాఖ మంత్రి ముఖ్యమంత్రి ఫోటోలు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దండి శ్రీనివాసరావు .కౌన్సిలర్లు గొర్లి వెంకటరమణ. గిరి రఘు సింగరపు ఈశ్వరరావు .హరి బాలాజీ .అబ్దుల్లా వైయస్సార్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. (Story : తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు)