ఏఇఇ లు అంకితభావంతో ప్రజలకు సేవ చేయాలి
మంత్రి సీతక్క
న్యూస్ తెలుగు /హైదరాబాద్, ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) :
బంజారాహిల్స్ లోని పంచాయతీ రాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో ఇటీవల నియామక పత్రాలు అందుకున్న ఏ ఇ ఇ లకు శిక్షణ కార్యక్రమంకు, ముఖ్య అతిధిగా, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, నీటిసరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క హాజరై ప్రారంభించి మాట్లాడుతూ అందరూ నిబద్ధతతో అంకితభావంతో ప్రజలకు సేవలు అందించాలని,
మీ పని తనమే మీకు గుర్తింపు తెచ్చిపెడుతుందన్నారు. నూతనంగా నియమితులైన ఏ ఇ ఇ లకు అభినందనలు తెలిపారు. నాణ్యత పై ఎక్కడ రాజీ పడొద్దని, శాశ్వతంగా నిలిచిపోయేలా మీ పనులు ఉండాలని పేర్కొన్నారు. మీ కుటుంబానికి, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి పెట్టేలా పనులు చేయాలని తెలిపారు. (Story : ఏఇఇ లు అంకితభావంతో ప్రజలకు సేవ చేయాలి)