రాబోయే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఆర్డీవో మహేష్
న్యూస్ తెలుగు / ధర్మవరం: ఈనెల 14వ తేదీ నుండి 17వ తేదీ వరకు జిల్లాలో భారీ వర్షాలు ఉన్నందున ధర్మవరం డివిజన్ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్డీవో కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ ఫోన్ నెంబర్ 956605759 న్యూ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కంట్రోల్ ఫోన్ నెంబర్ కు భారీ వర్షాల దృష్ట్యా ఏమైనా సంఘటనలు జరిగితే వెంటనే సమాచారాన్ని అందించాలని వారు తెలిపారు. ప్రజలు వాస్తవంగా తగిన జాగ్రత్తలతో ఉండాలని మరోసారి సూచించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా మట్టి మిద్దెలు ఎందు నివాసమున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతంలోని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, పేరూరు డ్యామ్ యోగివేమన డ్యామునకు ఎవరు కూడా చేపలు పట్టుటకు వెళ్ళరాదని వారు స్పష్టం చేశారు. కావున రెవెన్యూ డివిజన్ ప్రజలు సహకరించాలని వారి కోరారు. (Story : రాబోయే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు)