UA-35385725-1 UA-35385725-1

పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం

పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం

ఇంటర్నేషనల్ స్థాయిలో విద్యను అందించడానికి చోరువా

నిరుద్యోగులకు నైపుణ్యం పై శిక్షణ తరగతులు

ఇంచర్ల లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణమునకు శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క

న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో :(వై. లకుమయ్య ) : విద్యా వ్యవస్థను మెరుగుపరచి, అసమానతలను రూపుమాపడమే ప్రభుత్వ లక్ష్యమని, దేశంలో ఎక్కడ లేని విధంగా ఇంటర్నేషనల్ స్థాయిలో విద్యార్థులకు విద్యా బోధన చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. శుక్రవారం ములుగు మండలం లోని ఇంచర్ల గ్రామంలో అంతర్జాతీయ ప్రమాణాలతో పేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందించడానికి ప్రజా ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మకమైన నిర్ణయంలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఐటి డి ఏ పి ఓ చిత్ర మిశ్రా లతొ కలసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన, భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పటిష్టపరిచేందుకు సమీకృత గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
ఆహ్లాదకరమైన వాతావరణంలో, అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాల నిర్మాణాలు చేపట్టనున్నట్లు
తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అత్యాధునికంగా నిర్మించే సమీకృత గురుకుల పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీ విద్యార్థులకు ఓకే ఆవరణలో భోధన చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో మొదటి దఫా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయించి, ములుగు నియోజకవర్గానికి నూతన పాఠశాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేసిందని అన్నారు. అన్ని కులాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు ఒకేచోట విద్యను అభ్యసించడంతో పాటు క్రీడల్లో ఉన్నత స్థాయి ఎదగడానికి, క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ పాఠశాలల్లో ఎస్సీ ,ఎస్టీ, బీసీ మైనారిటీ పిల్లలందరూ కులమతాలకు అతీతంగా చదువుకోవచ్చని తెలిపారు. ఈ పాఠశాలల్లో చదువుతోపాటు ,అన్ని వసతులు ఉంటాయని, ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తున్నామని, క్రీడల వల్ల మానసికంగా విద్యార్థులు ఎదుగుతారని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల శంకుస్థాపనతో, తెలంగాణకు ఒక రోజు ముందుగానే దసరా పండుగ వచ్చిందని అన్నారు.
ములుగు జిల్లా లో 25 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టి, ప్రతి తరగతిలో డిజిటల్ స్మార్ట్ బోర్డులు, కంప్యూటర్ సెంటర్ లు, లైబ్రరీలను ఏర్పాటు చేనున్నట్లు తెలిపారు. కుల, మత, వర్గ అంతరాలు లేని విద్యా సౌధంలో క్రీడలను ప్రోత్సహించేలా క్రికెట్, ఫుట్ బాల్ గ్రౌండ్స్ తో పాటు బాస్కెట్ బాల్, టెన్నిస్ కోర్టులను ఏర్పాటుచేసి, విద్యార్థులను విద్యతోపాటు క్రీడల్లో రాణించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు.
గత పది సంవత్సరాల కాలంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించకుండా గత పాలకులు నిర్లక్ష్యం వహించారని పది నెలల కాలంలోనే చరిత్రలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు తరగతిగతుల్లోనే ఉంటుందని, విద్యార్థిని విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో రానున్న రోజులలో నైపుణ్యం శిక్షణ కేంద్రం ఏర్పాటుతో పాటు, ములుగు జిల్లా కేంద్రంలో బస్టాండు నిర్మాణం, ఏటూరునాగారం మండల కేంద్రంలో బస్ డిపో ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాల, గిరిజన యూనివర్సిటీని మంత్రులతో ప్రారంభించడం జరుగుతుందనిఅన్నారు. నూతనంగా చేపట్టిన ఇంటిగ్రేట్ పాఠశాల భవన నిర్మాణ పనులను, నాణ్యతతో పనులు చేసి, నిర్మాణ పనులను సంవత్సరంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. గిరిజన విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి, ఐటిడిఏ ద్వారా 43 మందికి లాప్టాప్ లు అందజేయడం జరిగిందని, ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు ఉన్నత చదువులు చదువుకోవడానికి ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు.
అంతకుముందు ములుగు మండల ప్రజా పరిషత్ అభివృద్ది అధికారి కార్యాలయం లో షెల్ ఇన్ఫోర్టెక్ సౌజన్యం తో 100 మంది కి దసరా స్పెషల్ రేషన్ కిట్స్,100 దుపాట్లను మంత్రి, కలెక్టర్ తొ కలసి నిరుపేదలకు అందచేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి కొమురయ్య, ఎంపి డి ఓ, తహసిల్దార్, ఏ పి, ఓ, ఎం పి ఓ, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. (Story : పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1