శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా త్వరలో నూతన కమిటీలు ఏర్పాటు
యం.యం.డి.ఏ
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ముస్లిం మైనారిటీ డెవలప్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఇమామ్ ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం నందు స్థానిక ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది.
అనంతరం ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సయ్యద్ రోషన్ జమీర్ మాట్లాడుతూ జిల్లాలో ముస్లిం మైనార్టీల సంక్షేమం మరియు వారి సమస్యల పరిష్కార మార్గమే లక్ష్యంగా పనిచేస్తున్న ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ అసోసియేషన్ (యం.యం.డి.ఏ) సంస్థ ద్వారా త్వరలో జిల్లా వ్యాప్తంగా నూతన కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగిన వారు సెల్.9133145985 సంప్రదించాలన్నారు.
కావున ముస్లిం మైనార్టీ ప్రజలలో సామాజిక, స్పృహ కల్గి సంస్థల్లో స్వచ్చందంగా సేవలు అందించడానికి, ఆసక్తి కలిగిన యువతకు జిల్లా, నగర, మండల, గ్రామ స్థాయి కమిటీలలో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం నియోజక వర్గం అధ్యక్షులు సయ్యద్ దాదా పీర్, యం.యం.డి.ఏ. సభ్యులు తహేర్ పీర్, ఖాదర్ వలీ, ముంతు, జిక్రియా, తదితరులు పాల్గొన్నారు. (Story : శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా త్వరలో నూతన కమిటీలు ఏర్పాటు )