మూల నక్షత్రం రోజు మరిన్ని సౌకర్యాలు కల్పించండి
నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
న్యూస్ తెలుగు/`విజయవాడ : విజయవాడ కనకదుర్గమ్మ ఉత్సవాల్లో భాగంగా మూల నక్షిత్రం రోజున అధిక సంఖ్యలో నగరానికి వచ్చేయాత్రికులకు మొరుగైన మరిన్ని సైకర్యాలు కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సంబందిత అధికారులను ఆదేశించారు. మూల నక్షత్రం రోజున యాత్రికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సంబందిత అధికారులతో కమిషనర్ మంగళవారం టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూల నక్షత్రం రోజు అమ్మవారి దర్శనానికి రాష్ట్రం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా యాత్రికులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశాలున్న నేపధ్యంలో ఏర్పాట్లును మరింత పెంచి, యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది, లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఉత్సవాలకు చేసిన ఏర్పాట్లులో ఎటువంటి లోపం లేకుండా చేసినందుకు సిబ్బందిని ప్రశంసిస్తూ మూల నక్షత్రం రోజు కూడా ఏర్పాట్లులో ఎలాంటి లోపాలు లేకుండా సిబ్బంది యాత్రికుల వద్దకు వెళ్లి చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. (Story : మూల నక్షత్రం రోజు మరిన్ని సౌకర్యాలు కల్పించండి)