మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కు పాదం మోపాలి : కుతుబ్
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగంపై అధికారులు ఉక్కు పాదం మోపాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి కుతుబ్, అధ్యక్షులు ఎత్తం మహేష్ డిమాండ్ చేశారు. మంగళవారం వనపర్తి ఆఫీస్ లో విలేకరులతో మాట్లాడారు. గంజాయి, కొకైన్, నల్ల మందు, ఫెరాయిన్ తదితర మాదకద్రగ్యాలకు యువత విద్యార్థులు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. వనపర్తి పట్టణంలో గతంలో గంజాయి పట్టుబడ్డ సందర్భాలు ఉన్నాయన్నారు. వీటివల్ల అనర్థాలను యువత విద్యార్థుల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. పేరెంట్స్, యువజన, విద్యార్థి సంఘాల ద్వారా యువతలో చైతన్యం కలిగించాలన్నారు. జిల్లా కేంద్రంలో కేజీ నుంచి పీజీ వరకు ఉన్నత విద్యాసంస్థలు ఉన్నాయని వాటిపై దృష్టి పెట్టాలన్నారు. ఏఐవైఎఫ్ నాయకులు అన్మగాళ్ల రమణ, విష్ణు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. (Story :మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కు పాదం మోపాలి : కుతుబ్)