నేడు విశాఖలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సమావేశం
ఐజేయు జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన నేతలు
న్యూస్‌తెలుగు/ విశాఖపట్నం : ఏపీయూడబ్ల్యూజే ఏపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విశాఖ లో బుధవారం జరగనుంది. గురుద్వారా కూడలిలో గల స్మార్ట్ ఇన్ హోటల్లో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ పాటు ఐజేయు ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణా రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ అధ్యక్షులు కె.శ్రీనివాసరెడ్డి హాజరు కానున్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం విశాఖ చేరుకున్న కే శ్రీనివాస్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విశాఖ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే రాము, ఆర్ రామచంద్రరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే చంద్రమోహన్, రవి, విశాలాంధ్ర విశాఖ ఎడిషన్ మేనేజర్ సనపల నరసింహులు , విశాలాంధ్ర విశాఖపట్నం బ్యూరో పి రామకృష్ణ , సీనియర్ జర్నలిస్టులు బండారు నాయుడు , కిరణ్, శివ, ఫణి , ప్రదీప్ తదితరులు స్వాగతం పలికారు. (Story : నేడు విశాఖలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సమావేశం)