కవి కరీముల్లాకు అబ్దుల్ కలాం అవార్డు
న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ కు చెందిన ప్రసిద్ధ కవి కరీముల్లాకు ప్రొద్దుటూరులో ఈ నెల 13న జరిగే జాతీయ మేధావుల సదస్సులో ఏపిజె అబ్దుల్ కలాం అవార్డు అందజేస్తున్నట్లు నూర్ బాషా ముస్లిం ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్.కె.బాజి తెలిపారు.తెలుగు సాహిత్య రంగంలో కవిగా కరీముల్లా చేసిన రచనలు సమాజాన్ని జాగృతం చేసే విధంగా విశేష ప్రభావాన్ని కలిగించాయని తెలిపారు.సమాజంలోని పేదల, పీడితుల సమస్యలపై ఆయన కలం అక్షర సమరం సాగించిందని,ఆయన ఎన్నో పుస్తకాలు జాతీయ సమైక్యతకు, మతసామరస్యానికి కట్టుబడి తెలుగు సాహిత్యంలో ప్రత్యేకంగా గుర్తింపు పొందాయని చెప్పారు..కరీముల్లా ఇప్పటివరకూ ఇరవై ఆరు పుస్తకాలు రాశారు.ఆయన కవిత్వం ఇంగ్లీష్, కన్నడం,హిందీ,ఉర్దూ,ఒరియా భాషల్లో అనువాదమై దేశవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలలో పరిశోధనాంశంగానూ, పాఠ్యాంశాలుగా ఉన్నాయి.ఇప్పటికే అనేక రాష్ట్ర, జాతీయ అవార్డులు, పురస్కారాలు అందుకున్న కరీముల్లా వినుకొండ ప్రాంతానికి గర్వకారణమని పలువురు కవులు, కళాకారులు ప్రశంసించారు.(Story:కవి కరీముల్లాకు అబ్దుల్ కలాం అవార్డు)