దూరదష్టి లోపాలకు ఆధునిక చికిత్సలు
మాక్సివిజన్‌లో స్మైల్ 500 టెక్నాలజీ యంత్రం
న్యూస్‌తెలుగు/విజయవాడ లబ్బీపేట : కంటి చికిత్స లో ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీలు అందు భాటులోకి తీసుకువస్తు ప్రజలకు వైద్యం అందిస్తున్న మాక్సివిజన్ ఐ హస్పటల్ యాజమాన్యాన్ని అభినందిస్తున్నానని సెంట్రల్ ఎమ్యేల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. బందర్ రోడ్డులోని మాక్సివిజన్ ఐ హస్సటల్ నం దు అత్యాధునిక స్మైల్ 500 టెక్నాలజీ సేవలను సోమవారం డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి, మాక్సివిజన్ గ్రూప్ సిఈఓ వీ.ఎస్.సుదీర్ లతో కలిసి బోండా ఉమా ప్రారం భించారు. అనంతరం డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ స్మైల్500 టెక్నాలజీని ప్రవేశపెట్టడం రెఫ్రాక్టివ్ శస్త్ర చికిత్సలో ఎంతో ముందడుగని, ఖచ్చితత్వంతో పాటు వేగవంతంగా కోలుకునే విధంగా ఈ చికిత్స ప్రత్యేకత అని ఖచ్చితత్వంతో పాటు వేగవంతంగా కోలుకునే విధంగా ఈ చికిత్స ప్రత్యేకత అని అన్నారు. ఈ చికిత్స విధానం ద్వారా రోగులకు మినిమల్ ఇన్వేసివ్ పద్దతిలో స్పష్టమైన దృష్టిని పొందే అవకాశం కల్పిస్తున్నామని, సంప్రదాయ లాసిక్ కంటే చిన్న గాటు ద్వారా శస్త్ర చికత్స చేయడం వలన డ్రై ఐ, ఇతర సమస్యలు తగ్గుతాయని, కార్నియా బలం మరింత కాపాడబడుతుందని తెలిపారు. అద్దాలు, కాంటాక్ట్ లెన్సెస్ పై ఆధారపడకుండా ఉండాలనుకును వారికి అత్యుత్తమ, సురక్షితమైన శాస్త్రచికిత్స పద్దతని తెలిపారు. అనంతరం వీ.ఎస్. సుదీర్ మాట్లాడుతూ విజయవాడలోనే అత్యాధునిక రెఫ్రాక్టివ్ శస్త్రచికిత్సలను అందిం చడం ఈ టెక్నాలజీ ద్వారా సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏ.ఏ.వి.రామలింగ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (Story : దూరదష్టి లోపాలకు ఆధునిక చికిత్సలు)