బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ సొల్యూషన్స్ ఏఐ – ఆధారిత ఉత్పత్తుల ఆవిష్కరణ
న్యూస్ తెలుగు/హైదరాబాద్: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లో జాబితా చేయబడిన, హైదరాబాద్ లో ప్రధాన కార్యాలయం కలిగిన బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ (బిసిఎస్ ), నాలుగు కృత్రిమ మేధస్సు (ఏఐ)- ఆధారిత ఉత్పత్తులను-బ్లూహెల్త్ అప్లికేషన్, బ్లురా, ఎడ్యు జెనీ, బయోస్టర్ ని సోమవారం భారతీయ మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ వినూత్న ఉత్పత్తులను ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఐటి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని నోవాటెల్ హెచ్‌ఐసీసీలో జరిగిన విడుదల కార్యక్రమానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముఖ్య అతిథిగా, మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా గౌరవ అతిథిగా హాజరయ్యారు. బిసిఎస్ చైర్మన్ జానకి యార్లగడ్డ మాట్లాడుతూ, తమ ప్రతి ఉత్పత్తి నిజమైన వైవిధ్యాన్ని కలిగించే పరిష్కారాలను రూపొందించడంలో కంపెనీని నడిపించే వినూత్న స్ఫూర్తిని ఎలా కలిగి ఉంటుందో వివరించారు. (Story : బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ సొల్యూషన్స్ ఏఐ – ఆధారిత ఉత్పత్తుల ఆవిష్కరణ)