యుటిఎఫ్ స్వర్నోత్సవాల చెస్ పోటీల్లో విజేతలు గా సత్యసాయి జిల్లా టీచర్స్
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యుటిఎఫ్ స్వర్నోత్సవ సంబరాలలో భాగంగా రాష్ట్రస్థాయిలో అక్టోబర్ 4, 5, 6 …మూడు రోజులు పాటు గుంటూరు నగరంలో ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి చెస్ పోటీలు నందు శ్రీ సత్య సాయి జిల్లా మహిళా టీచర్స్ 45 సంవత్సరాల పైబడిన విభాగంలో ప్రథమ స్థానంలో పి ..సీతామహాలక్ష్మి.40 సంవత్సరాల లోపల విభాగంలో జరిగిన చెస్ పోటీల్లో రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం ఎస్. సబిహ భాను సాధించారు.రెండు విభాగాల్లోనూ సత్యసాయి మహిళా టీచర్స్ రాణించడం విశేషమని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయ చంద్రా రెడ్డి , ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్ ఈ సందర్భంగా తెలియజేశారు.. అలాగే 100 మీటర్స్ పరుగు పందెం విభాగంలో రాష్ట్రస్థాయిలో జిసి నరేష్ కుమార్ తృతీయ స్థానంలో, 400 మీటర్ల నడక విభాగంలో ద్వితీయ స్థానం కె. శరణు ముకేంద్ర రాణించడం విశేషం అని తెలిపారు. గెలుపొందిన విజేతలకు రాష్ట్ర యుటిఎఫ్ అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎస్ ప్రసాద్ గారు, రాష్ట్ర కార్యదర్శి జీవి రమణ, సత్యసాయి జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రారెడ్డి, గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కలదర్, ప్రచురణల కమిటీ చైర్మన్ హనుమంతరావు, ఐక్యఉపాధ్యాయ ప్రధాన సంపాదకులు కుమార్ రాజా చేతుల మీదుగా విజేతలకు సర్టిఫికెట్లు మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్య సాయి జిల్లా కార్యదర్శి . నరేష్ కుమార్, సత్యసాయి జిల్లా మున్సిపల్ సబ్ కమిటీ కన్వీనర్ బిల్లే రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.(Story:యుటిఎఫ్ స్వర్నోత్సవాల చెస్ పోటీల్లో విజేతలు గా సత్యసాయి జిల్లా టీచర్స్)