అంతర్జాతీయ జాతీయ అవార్డులుపొందిన బ్రాహ్మణ పెద్దలకు ఘన సన్మానం..
న్యూస్ తెలుగు /వినుకొండ : నియోజకవర్గ ప్రాంత బ్రాహ్మణ పెద్దలు ప్రముఖ ఆర్టిస్ట్ బొడ్డుచర్ల ప్రసాద్ , మరియు కేసానపల్లి సుబ్బారావు లు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సాధించిన సందర్భంగా వినుకొండ నియోజకవర్గ బ్రాహ్మణ పెద్దలచే ఘన సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ పెద్దలు గాలి శ్రీకృష్ణయ్య , విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు భాగవతుల రవికుమార్ , బ్రాహ్మణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మంత్రిరాజు సత్యనారాయణ , కార్యదర్శి గాలి శ్రీనివాసరావు , సమాజ సేవకులు భాగవతం జనార్ధనాచార్యులు , అన్నాప్రగడ వెంకటేశ్వరరావు , అప్పరాజు నాగేశ్వరరావు , పీవీ సురేష్ బాబు , దేవులపల్లి చంద్రశేఖర్ శర్మ , పాల్గొనగా ముఖ్యఅతిథిగా శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ మేనేజర్ గాలి రమణారావు పాల్గొన్నారు, ఈ సభాధ్యక్షులుగా వినుకొండ పట్టణ పురోహితులు మరియు విశ్వ సాయి జూనియర్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ యడవల్లి శ్రీనివాస్ శర్మ వ్యవహరించారు. ఇటువంటి ఎన్నో బిరుదులు సత్కారాలు బ్రాహ్మణ పెద్దలు పొందటం వినుకొండకే గర్వకారణం అని తెలియజేశారు. ఈ ప్రాంతంలో ఉన్న బ్రాహ్మణులు ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధించడమే కాకుండా సమాజ సేవలో కూడా ముందు ఉండటం మనకు గర్వకారణం అని తెలియజేశారు.(Story:అంతర్జాతీయ జాతీయ అవార్డులుపొందిన బ్రాహ్మణ పెద్దలకు ఘన సన్మానం..)