భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శత వార్షికోత్సవాలను జయప్రదం చేయండి
సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్
న్యూస్ తెలుగు/వినుకొండ : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆవిర్భవించి ఈ డిసెంబర్ 26 నాటికి 100వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా జాతీయ సమితి పిలుపుమేరకు వాడవాడలా శత జయింతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి అన్నారు. శుక్రవారం రాత్రి వినుకొండ పట్టణంలోని అజాద్ నగర్ కాలనీ ఖాసిం ఖాన్ డివిజన్లో జరిగిన శాఖా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్ర్యం అనంతరం సిపిఐ మనదేశంలో పేద బడుగు బలహీన వర్గాలను చేరదీసి వారి అభ్యున్నతి కోసం కుల మత వర్గ తేడాలు లేని సమ సమాజం కోసం పోరాడుతూ సమాజంలో జమీందారులు జాగీర్దారులు గ్రామీణ ప్రాంతాలలో భూస్వామ్య పెద్దదారులు పేదలు, పేద రైతాంగం పై సాగిస్తున్న దౌర్జన్యాలపై కార్మికులు కష్టజీవులకు శ్రమకు తగ్గ ఫలితం సాధించుటకు అందరిని ఐక్యం చేసి పోరాటాలు జరిపి విజయం సాధించిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీదన్నారు. బాల్చన్దొర, నీ కాల్మొక్తా దొర అంటూ దొరల గడీలలో జీత గాడి జీవితాన్ని అనుభవించిన బడుగు జీవులకు ధైర్యం చెప్పి బందూకులతో పోరాటాలకు సిద్ధం చేసి 10 లక్షల ఎకరాల భూములను పేద కూలీలకు రైతాంగానికి పంచిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీ దన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని కుల మతాల పేరుతో దేశ ప్రజల మధ్య చిచ్చు రేపే మత విద్వేషాలకు వ్యతిరేకంగా సిపిఐ అనేక దశాబ్దాలుగా పోరాడుతోందని నేడు కూడా కేంద్రంలో అటువంటి శక్తులు పెచ్చరిల్లిపోతున్న నేపద్యంలో మరోసారి మత ఉన్మాదాన్ని పెరిగిపోకుండా భిన్నత్వంలో ఏకత్వం గా బహుళ మతాలు కులాలు కలిసి జీవిస్తున్న భారతదేశంలో ఎవరు నమ్మిన మతాన్ని వారు విశ్వసించుట ఆ ప్రక్రియను అందరూ గౌరవించే విధానాన్ని కొనసాగించుటకు, మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకికవాద శక్తులను కలుపుకొని కేంద్రంలో లౌకిక పార్టీలతో కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయుటకు ఇండియా కూటమిని ఏర్పాటుచేసి ప్రభుత్వాన్ని స్థాపించుటకు సిపిఐ నిరంతర పోరు సల్పుతోందని అన్నారు. మన వినుకొండ నియోజకవర్గంలో పులుపుల శివయ్య స్ఫూర్తితో “”వెనుక తరముల వారి వీర చరితల సిరులు నార్వోశి త్యాగమ్ము నీర్వెట్టి పెంచగా తిరిగి సుఖములు పొందరా పలనాడు వీలలేని మాగాణి రా”” అని చెప్పిన ఆయన కవిత్వం నేడు నిజమైందని అన్నారు. ఒకనాటి ఎన్నికల వ్యవస్థ నేటి ఎన్నికల వ్యవస్థ తీరుతెనులపై ప్రజలు అవాక్కైతున్నారని మార్పు చెందవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలే దానికి సరైన నిర్నేతలని ఆయన అన్నారు. మన జిల్లాలో వరిక పుడిశెల ఎత్తిపోతల పథకం ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు వెంటనే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తద్వారా బొల్లాపల్లి మండలంలోని పేద ప్రజల మంచినీరు సాగునీరు వెతలు తీరుతాయని ఆయన అన్నారు. వినుకొండ ప్రాంతంలోని అనేక గ్రామాలలో పట్టణంలోని శివారు కాలనీలలో ఆజాద్ నగర్ కాలనీ లో మంచినీటి సమస్య కరెంటు సమస్యలు వెంటనే పరిష్కరించాలని అన్నారు. నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ పేద ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కమ్యూనిస్టు పార్టీ గత 100 సంవత్సరాలుగా పోరాడుతోందని సమసమాజ నిర్మాణం కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం అజాద్ నగర్ లోని ప్రజలను అనేకసార్లు కలెక్టర్ ఆఫీసుల వద్ద ధర్నాలు నిర్వహించి పోరాటాలు కొనసాగించామని అదే పద్ధతి లో మా పోరాటాన్ని కొనసాగిస్తామని వారన్నారు. ఆజాద్ నగర్ కు మంచినీరు రోడ్లు కరెంటు పెన్షన్లు సాధించాలని తీర్మానించారు. ఈ సమావేశానికి అధ్యక్షులుగా పద్మావతి వ్యవహరించగా సమావేశంలో షేక్ మహబూబ్ బి, షేక్ మస్తాన్, రంజాన్ బి, రమణ, హసన్, కరిముల్లా, సైదాబీ, దరియాబి, లక్ష్మీ, నారాయణమ్మ,కె. మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. (Story : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శత వార్షికోత్సవాలను జయప్రదం చేయండి )