గంజాయి పై ప్రత్యేక నిఘా
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండండి.
కోడిపందాలు, పేకాటలపై ఉపేక్షించేది లేదు రూరల్ సీఐ బి లక్ష్మణరావు
న్యూస్ తెలుగు/ విజయనగరం : గంజాయి పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడమైనదని, సైబర్ నేరాలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కోడిపందాలు,పేకాటలపై ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని రూరల్ సీఐ బి లక్ష్మణరావు తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం యువత మాదకద్రవ్యాల పై ఆసక్తి చూపడం చాలా బాధాకరమన్నారు. రానున్న కాలంలో తన పరిధిలో ఉన్న అన్ని కళాశాలలో గంజాయి, తదితర మాదక ద్రవ్యాల పై పూర్తిస్థాయిలో ప్రతి తరగతిలో కూడా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు చేస్తున్న కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. రానున్న పండగల నేపథ్యంలో కోడిపందాలు, పేకాట, అక్రమ మద్యంపై పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తున్నామన్నారు. గ్రామాల్లో పండుగల నేపథ్యంలో ఎటువంటి గొడవలు లేకుండా చూసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు వాహనాల తనిఖీ నిర్వహించి నేరస్తులను గుర్తించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. దొంగతనాల నిర్మూలనకు రాత్రిపూట గస్తీ పెంచుతామన్నారు. ప్రస్తుతం యువత అతివేగంతో ప్రయాణం చేస్తున్నారని అది ఎంతో ప్రమాదకరమన్నారు. (Story : గంజాయి పై ప్రత్యేక నిఘా)