గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి
మెడికల్ ఆఫీసర్.. డాక్టర్ ప్రియాంక
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను కనపరచాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక తెలిపారు. ఈ సందర్భంగా కొత్తపేటలోని అర్బన్ హెల్త్ సెంటర్లో మానవతా సంస్థ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు35 మందికి పండ్లు పంపిణీ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అనంతరం మానవతా సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తి, డాక్టర్ ప్రియాంక, కార్యదర్శి మంజునాథ్, ఉపాధ్యక్షులు జగ్గా వేణుగోపాల్, కోశాధికారి చంద్రశేఖర్, డైరెక్టర్ రాంప్రసాద్ మాట్లాడుతూ గర్భిణీల ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులు అందరూ కూడా తమ సహాయ సహకారాలు అందించాలని, గర్భిణీని మానసిక ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవలసిన బాధ్యత కుటుంబ సభ్యులదేనని తెలిపారు. తదుపరి వైద్యులు తెలిపిన మేరకు ప్రతినెల ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, సంబంధిత ఇంజక్షన్లు తప్పనిసరిగా వేయించుకోవాలని తెలిపారు. డాక్టర్ సలహా సూచనలతో ప్రశాంతమైన జీవితమును కొనసాగించాలని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. (Story : గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి)