UA-35385725-1 UA-35385725-1

జగన్ బెంగళూరులో ఫుల్‌టైమ్, రాష్ట్రంలో పార్ట్‌టైమ్ రాజకీయాలు

జగన్ బెంగళూరులో ఫుల్‌టైమ్, రాష్ట్రంలో పార్ట్‌టైమ్ రాజకీయాలు

మంత్రి నారా లోకేష్‌ను కలిసిన ఎమ్మెల్యే జీవీ, మాజీ ఎమ్మెల్యే మక్కెన

న్యూస్ తెలుగు/వినుకొండ : మాజీ ముఖ్యమంత్రి జగన్ బెంగళూరులో ఫుల్‌టైమ్, రాష్ట్రంలో పార్ట్‌టైమ్ రాజకీయాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఎద్దేవా చేశారు. అసలు పాస్‌పోర్ట్‌కు కోర్టు ఇబ్బంది లేకుంటే లండన్‌లో ఫుల్‌టైమ్‌, బెంగళూరులో పార్ట్‌టైమ్ ఉంటూ ఆంధ్రా ప్రజల్ని గాలికి వదిలేసేవాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారాయన. దోపిడీ తప్ప ప్రజల కోసం నిలబడి పని చేద్దామని ఆలోచన లేని వ్యక్తులు ఇలానే తగలబడతారని చురకలు వేశారు. ఉదాహరణకు జగన్ తన 5ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో ఒక్కదాన్నైనా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. పేదపిల్లలు చదువుకునే గురుకుల పాఠశాలలు, హాస్టళ్లను నిర్వీర్యం చేశారని వాపోయారు. నా బీసీలు, నా ఎస్సీలని మాటల కోతలు కోసిన జగన్మోహన్ రెడ్డి, ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలను చదువుకునే హాస్టళ్లలో బాత్రూమ్‌లు రిపేర్ గానీ, మంచినీళ్ల టాప్ వేయించడం గానీ చేయలేదన్నారు. శుక్రవారం మంత్రి నారా లోకేష్‌ను ఆయన నివాసంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మర్యాదపూర్వకంగా కలిశారు. తన శివశక్తి ఫౌండేషన్ ద్వారా వినుకొండ నియోజకవర్గంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల విద్యార్థుల సౌకర్యాల కోసం రూ.15 లక్షలు విరాళంగా ఇస్తానని మంత్రి లోకేష్‌కు చెప్పినట్లు ఎమ్మెల్యే జీవీ, ఆయా హాస్టళ్లలో సౌకర్యాల కల్పన, మరమ్మతులు, ఆట వస్తువుల కొనుగోలు వంటి అవసరాలకు ఈ మొత్తం ఉపయోగించుకోవాలని కోరారు. రానున్న 2, 3నెలల్లో అవన్నీ పూర్తి చేస్తామన్నారు. అలానే తన తల్లి పేరిట మహిళా జూనియర్ కాలేజీ లేదా మహిళా హైస్కూల్ పెడితే కావాల్సిన స్థలం, నిర్మాణ వ్యయంలో 25% చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. గతంలో తమ సొంత గ్రామం ఇనిమెళ్లలో తన తండ్రి పేరిట గతంలో స్థలం ఇచ్చి హైస్కూల్ తీసుకొచ్చామని, ఇప్పుడా స్కూల్‌కు కూడా అదనపు గదులు అవసరం అవుతున్నాయన్నారు. దానికి కూడా 25% విరాళం ఇస్తానన్నారు. ఇక జగన్ రెడ్డి రాష్ట్రాన్ని 14 లక్షల కోట్ల అప్పులపాలు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. జనాన్ని లూటీ చేసి జనాన్ని అప్పులో ఊబిలోకి నెట్టారన్నారు. ఇలాంటి తరుణంలో పిల్లలకు అవసరమైన పాఠశాలలు, కళాశాలల నిర్మాణం కోసం 25% విరాళం ఇస్తే వారి పేర్లు పెట్టుకునే అవకాశం కల్పించాలని మంత్రి లోకేష్‌ ను కోరినట్లు తెలిపారు. ఓటమి దగ్గర్నుంచి ఏపీకి పార్ట్‌టైమ్ పొలిటీషియన్‌గా మారిన జగన్ వారంలో 2, 3రోజులు నెలలో ఓ 10 రోజులే రాష్ట్రంలో ఉండి మిగిలి రోజులు బెంగళూరు ఎలహంక ప్యాలెస్‌లో మకాం వేస్తున్నాడన్నారు. ఆ పార్ట్ టైమ్‌లో కూడా కుట్రలు, శవ రాజకీయా లతో కూటమి ప్రభుత్వంపై బురద చల్లడానికి సరిపోతోందన్నారు. అసలు ఇన్ని లక్షల కోట్లు దోచుకున్న జగన్ అధికారం దిగిపోయిన ఈ 100 రోజుల్లో కనీసం ఒక్కమంచి పని అయినా చేశారా అని ప్రశ్నించారు. కనీసం ఒక్క పేదవాడికి అయినా న్యాయం చేశారా అని నిలదీశారు. కోర్టులో ఆ పాస్‌పోర్ట్ ఇబ్బందిగనక లేకుంటే ఈపాటికే చక్కగా లండన్ చెక్కేసేవాడన్నారు. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చి… ఏ అవకాశం వచ్చిన సొంత దోపిడీకే వాడుకున్న గజ దొంగ జగన్ అని తూర్పార బట్టారు. అవన్నీ గుర్తించే ప్రజలు 151 నుంచి 11కి దించారన్నారు. అతడు చేసిన తప్పులకు ప్రజలు ఎప్పుడు వచ్చి దాడి చేస్తారో, రాళ్లు వేస్తారో అనే భయంతో ఇల్లునే జైలుగా కట్టించుకున్న మహానుభావుడు కూడా జగనే అన్నారు. జగన్ చేసిన తప్పులు, పెట్టిన తప్పుడు కేసులతో ప్రజలకు భయపడి పరదా ల్లో దాక్కోవడం, 20, 30 కిలోమీటర్లకు కూడా హెలీకాఫ్టర్లలో వెళ్లడం చేసేవాడన్నారు. చేసిన పాపాలు, సీబీఐ కేసులు వెంటపడుతునే ఉన్నాయని, భవిష్యత్‌లో అతడు జైలుకి పోవడం కూడా ఖాయమన్నారు. జగన్‌కు ఇప్పుడు ఇంట్లో ఉన్నా సుఖం లేదని, చేసిన పాపాలు గుర్తొస్తునే ఉంటాయన్నారు. ఇప్పటికైనా జగన్ మారాలి, తప్పు రాజకీయాలు, శవరాజకీయాలు మానుకో వాలని హితవు పలికారు. (Story : జగన్ బెంగళూరులో ఫుల్‌టైమ్, రాష్ట్రంలో పార్ట్‌టైమ్ రాజకీయాలు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1