రైతులు పంటల విషయంలో జాగ్రత్తలు పాటించాలి
మండల వ్యవసాయ అధికారి ముస్తఫా
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పంటల విషయములో రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ అధికారి ముస్తఫా, పశు వైద్యాధికారి శేఖర్, సిరికల్చర్ అధికారి దామోదర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వీరు చింతలపల్లి, వసంతపురం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ చింతలపల్లి గ్రామ పరిధిలోని నాగభూషణం యొక్క వరి పొలాన్ని పరిశీలించడం జరిగింది అని తెలిపారు. వరిలో ఆకుముడుత నివారణకు క్లోరిపై ఎంఎల్ పర్ లీటర్ ద్రావణానికి పిచికారి చేసుకోవాల్సిందిగా సూచించడం జరిగిందన్నారు. అలాగే ప్రకృతి వ్యవసాయం వారి ఆధ్వర్యంలో తయారు చేయు విధానం చేసి చూపించడం జరిగింది అని తెలిపారు. పట్టు పరిశ్రమ అధికారి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ పట్టు సాగు వల్ల ఉపయోగాలు, వివిధ పథకాల గురించి వివరించడం జరిగింది అని తెలిపారు. రైతులు పంట సాగులోని మెలుకువలు రైతులకు వివరించారు. వసంతపురంలోని బాబయ్య అనే రైతుకు చెందిన కందిపొలాన్ని పరిశీలించడం జరిగింది అని, ప్రస్తుతం కంది పూత , పింద దశలో ఉంది, పచ్చ పురుగు నివారణ కోసం ఇమామెక్టిన్ బెంజోయేట్ ఎకరాకు 100 గ్రాములు పిచికారి చేసుకోవాల్సిందిగా సూచించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ,బాబయ్య ఏఈఓ అశ్విని, ఎంపీఇఒ స్వాతి , ఏపీ సీఎం ఎఫ్ ఆదినారాయణ,గ్రామ రైతులు పాల్గొన్నారు. (Story : రైతులు పంటల విషయంలో జాగ్రత్తలు పాటించాలి)