Home వార్తలు తెలంగాణ ములుగు ప్రభుత్వా ఆసుపత్రి ని సందర్శించిన డా.రవీందర్ నాయక్

ములుగు ప్రభుత్వా ఆసుపత్రి ని సందర్శించిన డా.రవీందర్ నాయక్

0

ములుగు ప్రభుత్వా ఆసుపత్రి ని సందర్శించిన డా.రవీందర్ నాయక్

న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో :(వై. లకుమయ్య )
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు డాక్టర్ రవీంద్ర నాయక్ జిల్లాల సందర్శన లోని భాగంగా శుక్రవారం ములుగు జిల్లా ప్రధాన ఆసుపత్రిని సందర్శించారు.ఆసుపత్రికి వచ్చిన రోగుల వద్దకు పోయి, వారి అవస్థలు ఇబ్బందులు అడిగి తెలుసుకుని ,వారికి డాక్టర్లు అందించిన వైద్య సేవల గురించి ఆరా తీశారు. అటు తరువాత పీడియాట్రిక్ ఇంటెన్సీ కేర్ యూనిట్ తదితర వార్డులను తిరిగి రోగుల వద్ద నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆసుపత్రి యందు ఉన్న మౌలిక సదుపాయాలు రోగులకు అనుగుణంగా ఉన్నాయా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.తర్వాత ఆసుపత్రి సిబ్బందితో మీటింగ్ ను నిర్వహించి, ఈ సందర్బంగా వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ మాట్లాడుతూ ఆస్పత్రి నందు ఉన్న మౌలిక సదుపాయాల వివరాలను అడిగి తెలుసుకుని , మౌలిక సదుపాయాలను రోగుల కు కల్పించాలని , ఆస్పత్రి సిబ్బందిని కోరారు. కోఆర్డినేషన్ ఉండాలి మెడికల్ కాలేజ్ , జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ , ఈ ముగ్గురు సమన్వయంతో పనిచేసి రోగులకు సేవలు అందించాలని కోరారు. అటు తరువాత ఆసుపత్రి యందు మానవ వనరుల కొరత, గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో, రాష్ట్ర ఆరోగ్య మరియు వైద్య కుటుంబ సంక్షేమ సంచాలకులతోపాటు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ . అప్పయ్య, ములుగు జిల్లా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ మోహన్ లాల్, ఆసుపత్రి ఆర్ఎంఓ ప్రవీణ్ కుమార్, జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ విపిన్ కుమార్, నర్సింగ్ సూపర్డెంట్, ఆసుపత్రి సిబ్బంది మొదలగు వారు పాల్గొన్నారు. (Story : ములుగు ప్రభుత్వా ఆసుపత్రి ని సందర్శించిన డా.రవీందర్ నాయక్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version