Home వార్తలు తెలంగాణ ఘనంగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 65పుట్టినరోజు వేడుకల

ఘనంగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 65పుట్టినరోజు వేడుకల

0

ఘనంగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 65పుట్టినరోజు వేడుకల

న్యూస్ తెలుగు/ వనపర్తి : మాజీమంత్రి సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి 65వ పుట్టినరోజు సందర్భంగా పట్టణ బి.ఆర్.ఎస్ పార్టీ పట్టణ మండల యువత ఆధ్వర్యములో పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయాలలో నిరంజన్ రెడ్డి అష్టఐశ్వర్యాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలంటూ పలువురు పూజలు నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పార్టీ అధ్యక్షులు పి.రమేష్ గౌడ్ ఆధ్వర్యములో పండ్లు,బెడ్స్,పాలు పంచడం జరిగింది. నిరంజన్ రెడ్డి స్వగృహంలో పట్టణ, మండల యువత అధ్యక్షులు సూర్యవంశపు.గిరి,చిట్యాల.రాము ఆధ్వర్యములో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. అదేవిధంగా నాగవరం గ్రామ బిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్,పి రమేష్ గౌడ్,మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్,సూర్యవంశం.గిరి మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపిన ఘనత నిరంజన్ రెడ్డి గారిదని అన్నారు. తెలంగాణ ఉద్యమములో కె.సి.ఆర్ గారికి కుడిభుజంగా నిలిచి రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు అని
వ్యవసాయ మంత్రిగా ఏడారిగా ఉన్న పాలమూరు జిల్లాను పాడిపంటలకు నెలువుగా చేయుటకు కృషి చేశారని అన్నారు. నియోజకవర్గాన్ని 100యేండ్ల ముందుకు అభివృద్ధి చేసి నిలిపారనీ అన్నారు. మళ్ళీ నిరంజన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కు ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్,గొఱ్ఱెల పెంపకం అధ్యక్షులు కురుమూర్తి,మాణిక్యం, ధర్మా నాయక్,గంధం.పరంజ్యోతి, కౌన్సిలర్ నాగన్న యాదవ్, ఉంగ్లమ్. తిరుమల్,స్టార్.రహీమ్, నీలస్వామి,గులాం ఖాదర్,ఖాన్, మహేశ్వర్ రెడ్డి, మాధవ్ రెడ్డి,సయ్యద్.జమేల్,కో.ఆప్షన్ సభ్యులు ఇమ్రాన్, డాక్టర్.డ్యా నియల్, ఫజల్,పి. సురేష్,జాణంపేట.శ్రీను,మాజీ మార్కెట్ డైరెక్టర్ శ్రీను, ఆరీఫ్, హేమంత్ ముదిరాజ్,సునీల్ వాల్మీకి,రామస్వామి,వజ్రాల రమేష్,ఖాదర్,ఖాధర్షా,మధులత, శిరివాటి.శంకర్, నాగవరం మాజీ సర్పంచ్ సుధాకర్, చెన్నారెడ్డి,పెద్ద ముక్కల.రవి,వెంకటేష్ గౌడ్,మోహన్ నాయి, యాదగిరి, కార్తీక్, మహేష్ పి.రవి,నాగరాజు,రాజేష్,తదితరులు పాల్గొన్నారు. (Story : ఘనంగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 65పుట్టినరోజు వేడుకల)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version