రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ ఆధ్వర్యంలో మహాత్మునికి నివాళి
న్యూస్‌తెలుగు/ వినుకొండ : స్వాతంత్ర సమరయోధులు మరియు త్యాగమూర్తులు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా వినుకొండ నరసరావుపేట రోడ్డు పెట్రోల్ బంకు వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించిన రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ అధ్యక్షులు గుమ్మ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. గాంధీ జీవితం ప్రపంచ పౌరులకు ఆదర్శప్రాయంగా ఉంటుందని అనగా గాంధీ మహాత్ముడు జీవితకాలం మద్యానికి దూరంగా ఉండటం స్మోకింగ్ దూరంగా ఉండటం మరియు శాఖాహార జీవితం ఆహార పద్ధతులు జీవితానికి సంపూర్ణత చేకూర్చాయని ఆయన యొక్క అహింస సిద్ధాంతం మరియు సత్యాన్ని అనుసరించుట మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడని రోటరీ క్లబ్ క్రియాశీలక సభ్యులు బెజవాడ వెంకట నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గుమ్మా శ్రీకాంత్ రెడ్డి , కార్యదర్శి వై వి నారాయణ, పూర్వ అధ్యక్షులు చిరుమామిళ్ల కోటేశ్వరరావు, గుత్తా గురునాథం, దావులూరి శ్రీనివాసరావు, ఎస్ కే కరీముల్లా, ఎల్ఐసి రామన్, బత్తుల శ్రీను, సాదినేని శ్రీనివాసరావు, పెనుగొండ రాజేష్, ఆంజనేయులు , సిహెచ్ నాగరాజు, ఎం రమేష్ , వెంకటేశ్వర్ రెడ్డి , ఎమ్మెస్ బాజీ , తదితరులు నివాళులర్పించారు. (Story : రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ ఆధ్వర్యంలో మహాత్మునికి నివాళి)