ఎమ్మెల్యే జీవి ఆధ్వర్యంలో స్వచ్ఛత ప్రతిజ్ఞ
న్యూస్‌తెలుగు/ వినుకొండ : స్వచ్ఛతాహి సేవ 2024 భాగంగా బుధవారం వినుకొండ పట్టణంలో “స్వభావ స్వచ్ఛతా- సంస్కార్ స్వచ్ఛతా” అన్న నినాదంతో గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 2న “స్వచ్ఛ భారత్ దివస్”ను ఎన్ ఎస్ పి కాలనీ సాయిబాబా గుడి సమీపంలో ఎమ్మెల్యే జీ.వీ.ఆంజనేయులు, గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ప్రజలతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి సామూహిక శ్రమదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసన సభ్యులు మక్కెన మల్లికార్జున్ , మునిసిపల్ చైర్మన్ దస్తగిరి , మునిసిపల్ కమీషనర్ సుభాష్ చంద్రబోస్ ,కౌన్సిలర్ ప్రత్తిపూర్ణ ,టౌన్ టీడీపీ పార్టీ అధ్యక్షులు అయూబ్ ఖాన్ ,పీవీ సురేష్ తదితర ప్రముఖులతో పాటుగా మునిసిపల్ ఈ ఈ దేవిక ,మున్సిపల్ సిబ్బంది ,సచివాలయ సానిటేషన్ సెక్రటరీస్ ,పారిశుధ్య కార్మికులు పాల్గొనారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే జీవి మాట్లాడుతూ గాంధీ కలగన్న స్వచ్ఛ భారత్ సాకారానికి ప్రజలందరూ స్వచ్ఛత మీద అవగాహన కలిగి ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తూ పట్టణంలో ప్రజలకు అనువుగా కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణం చేపట్టాలని, ఆవులు, పందులు చేయు అపరిశుభ్రతను కట్టడిచెయ్యాలని ,పట్టణ పరిశుభ్రతను నిర్వహించాలని కమీషనర్ సుభాష్ చంద్రబోస్ కు సూచించారు. అనంతరం ఎన్ ఎస్ పి కాలనీ సాయిబాబా గుడి సమీపంలో ఉన్న వాకర్స్ ట్రాక్ చుట్టూ ఉన్న చెత్తను, పిచ్చి మొక్కలను తొలగించు శ్రమదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, గురునాథం, గోల్డ్ కరిముళ్ళ, బత్తుల గోవిందరాజులు, రొడ్డ వీరాంజనేయరెడ్డి ,పెమ్మసాని నాగేశ్వరరావు న్యాయవాదులు పొట్లూరు సైదారావు, నలబోలు రాంకోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. (Story : ఎమ్మెల్యే జీవి ఆధ్వర్యంలో స్వచ్ఛత ప్రతిజ్ఞ)