కొలవర్ రాష్ట్ర కార్యవర్గం అత్యవసర సమావేశం
న్యూస్ తెలుగు / కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా : బెజ్జూర్ మండలం లోని ఆదివాసి భవన్ లో బుధవారం కొలవార్ సేవా సంఘం అత్యవసర సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర అధ్యక్ష, జనరల్ సెక్రెటరీ పారేపల్లి పోశం, నేర్మిల్లి సదాశివ్ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం ఆదివాసులకు చెందాల్సిన హక్కులు రావడంలేదని కొలవార్ లను పీవిటిజి లో చేరిపించాలని ఐటీడీఏ ద్వారా 100% రాయితీపై రుణాలు ఇవ్వాలని ప్రతి మండల కేంద్రంలో 50 లక్షలతో కోలావార్ సంక్షేమ భవనాన్ని మంజూరు చేయాలని కోరుతూ తీర్మానించినట్లు వారు తెలిపినారు అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల ఆరవ తేదీ ఆదివారం రోజున కాగజ్నగర్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో రాష్ట్ర కార్యవర్గా బాధ్యతలు అప్పగింత ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కోలావర్ నాయకులు రావాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పారేపల్లి పోషం, జనరల్ సెక్రెటరీ నేర్పెల్లి సదాశివ్, గౌరవ అధ్యక్షులు నేర్పెల్లి బ్రహ్మయ్య, రాష్ట్ర కార్యదర్శి తుమ్మిడి అశోక్, ఉద్యోగ సంఘం రాష్ట్ర కార్యదర్శి మానేపల్లి లక్ష్మణ్, జిల్లా నాయకులు బిబ్బేర భూమయ్య, కౌటాల మండల అధ్యక్షులు ఎడ్ల భీమయ్య, బెజ్జూర్ మండల అధ్యక్షులు పెద్దల శంకర్, చింతల మానేపల్లి, మండల నాయకులు పారేపల్లి నరసింహులు, బుర్రి నీలయ్య, యూత్ మండల అధ్యక్షులు ఎడ్ల మహేష్, గ్రామ యూత్ అధ్యక్షులు మేడి సతీష్, గ్రామ పెద్దలు ఆత్రం బక్కయ్య, పెద్దల సంతోష్, చింతపుడి ప్రకాష్, మేకల గొంతు, బండి రాజారాం గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు.(Story : కొలవర్ రాష్ట్ర కార్యవర్గం అత్యవసర సమావేశం)