అదనపు ఎస్పీ (అడ్మిన్) గా బాధ్యతలు చేపట్టిన సౌమ్యలత
న్యూస్‌తెలుగు/విజయనగరం : జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) గా సౌమ్యలత మంగళవారం పోలీసు కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎసిబిలో పని చేస్తున్న సౌమ్యలతను విజయనగరం జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన)గా నియమించింది. అదనపు ఎస్పీగా సౌమ్యలత బాధ్యతలు చేపట్టిన తరువాత జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ను జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి, పూల మొక్కను అందజేశారు.జిల్లా ఎస్పీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయ పని తీరును పర్యవేక్షించాలని, రాష్ట్ర డిజిపి కార్యాలయం, రేంజ్ పోలీసు కార్యాలయాలతో జరపాల్సిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఎటువంటి కాలయాపన లేకుండా జరిగే విధంగా చూడాలని అదనపు ఎస్పీ సౌమ్యలతను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.డైరెక్ట్ డిఎస్పీగా పోలీసుశాఖకు ఎంపికైన పి.సౌమ్యలత, గతంలో బొబ్బిలి, ఇంటిలిజెన్సు, ఎసిబిలో సమర్ధవంతంగా పని చేసారు.నూతనంగా బాధ్యతలు చేపట్టిన అదనపు ఎస్పీ పి.సౌమ్యలత ను డిఎస్పీలు ఎం.శ్రీనివాసరావు, ఎం.వీరకుమార్, సిఐలు ఎవి లీలారావు, ఆర్ వి ఆర్కే చౌదరి, ఎస్.శ్రీనివాస్, టి.శ్రీనివాసరావు, జి.రామకృష్ణ, ఎన్.వి.ప్రభాకరరావు, బి.లక్ష్మణరావు, షణ్ముఖరావు, బి.వెంకటరావు, ఆర్ఎస్ఐలు ఎన్.గోపాల నాయుడు, ఆర్.రమేష్ కుమార్, టి.భగవాన్ మరియు పలువురు పోలీసు అధికారులు, జిల్లా పోలీసు కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి, పుష్ప గుచ్ఛాలను, పూల మొక్కలను అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. (Story : అదనపు ఎస్పీ (అడ్మిన్) గా బాధ్యతలు చేపట్టిన సౌమ్యలత)