Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాల అమలు చేయాలి : ఎఐటియుసి

మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాల అమలు చేయాలి : ఎఐటియుసి

మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాల అమలు చేయాలి : ఎఐటియుసి

న్యూస్‌తెలుగు/ వినుకొండ : రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో వివిధ కేటగిరీలలో పనిచేయుచున్న ఇంజనీరింగ్ వర్కర్స్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కార్మికులు వాటర్ వర్క్స్, కరెంటు, డ్రైవర్స్, బోర్ వర్కర్స్, పారిశుద్ధ్య కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించి ఆమోదించిన కనీస వేతనాలను వెంటనే అమలు చేయాలని ఏఐటీయూసీ మాజీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ. మారుతీ వరప్రసాద్, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం నాడు స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కార్మికుల మస్టర్ సమయములో కేంద్ర ప్రభుత్వం కార్మిక శాఖ ఆమోదించి వెలువరించిన మున్సిపల్ కార్మికుల కనీస వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే అమలు జరపాలని జరిగిన ధర్నాలో వారు మాట్లాడుతూ. రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో వివిధ కేటగిరీలలో పనిచేయుచున్న ఇంజనీరింగ్ పారిశుద్ధ్య కార్మికులు అనేక దశాబ్దాలుగా కనీస వేతనాలు అమలు చేయాలని అనేక పోరాటాలు చేయడం జరిగిందని రాష్ట్రంలోని పాలకులు వివిధ కారణాలు చెప్పుచు కార్మికులకు కనీస వేతనాలు అమలుపరచుటలో తీవ్ర జాప్యం చేస్తున్నారని వారు విమర్శించారు. ఇటీవల కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆమోదించి వెలువరించిన హైస్కిల్డ్ కార్మికులకు 26,910 రూపాయలు, నైపుణ్యం కలిగిన కార్మికులు క్లరికల్ సిబ్బందికి నెలకు 24800 రూపాయలు, సెమీ స్కిల్డ్ కార్మికులకు నెలకు 22600 రూపాయలు వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు స్కిల్డ్ సెమి స్కిల్డ్ వేతనాలను పారిశుద్ధ్య కార్మికుల కనీస వేతనాలను క్రమ పద్ధతిలో సవరించి వెంటనే అమలు జరపాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అనేక వరదలు తుఫానులు సంభవించినప్పుడు విశాఖలో హుదూద్ తుఫాన్ సంభవించినప్పుడు దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి లక్షలాదిమందిని పొట్టన పెట్టుకున్నప్పుడు దేశం మొత్తంలో మొట్టమొదటిగా బయటకు వచ్చి అడుగుపెట్టి పని చేసిన కార్మికుడు మునిసిపల్ కార్మికులేనని తుఫానులు సంభవించి ప్రజలు ఇక్కట్ల పాలైనప్పుడు మున్సిపల్ కార్మికులే వారి వీధులను శుభ్రం చేసి వారి గృహాలను సైతం కడిగి మంచినీటి వసతులు, పారిశుద్ధ్యం కలిగించుట ఇటీవల విజయవాడ వరదల్లో విశాఖ హుదూద్ తుఫాను సమయంలో ప్రజలను ఆదుకొని తిరిగి ఆయా నగరాలు పునర్నిర్మాణం పొందుటలో మునిసిపల్ కార్మికుల కృషి త్యాగం ఎనలేనిదని వారన్నారు. కరోనా సమయంలో అందరూ కరోనా సోకి చనిపోతామని ఇంటిలో దాగి ఉన్న సమయంలో మునిసిపల్ కార్మికులు ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి బయటకు వచ్చి మన నగరాలను పట్టణాలను సుందరీకరణ చేయుటలో పరిశుభ్రం చేయుటలో ప్రధాన పాత్ర పోషించారని వారన్నారు. అటువంటి కార్మికుల కనీస వేతనాన్ని అనేకసార్లు పోరాటాలు ధర్నాలు చేయవలసిన స్థితి పాలకులు ప్రభుత్వాలు కల్పిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కావున రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ప్రతిపాదించి ఆమోదించిన మున్సిపల్ కార్మికుల కనీస వేతనాలను వెంటనే పెంపుదల చేసి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సంపెంగుల అబ్రహం రాజు, పచ్చి గొర్ల యేసు, ట్రాక్టర్ డ్రైవర్స్ కంచర్ల కోటేశ్వరరావు, రమణారెడ్డి, లింగాల వెంకటేశ్వర్లు, తిప్పిశెట్టి కోటేశ్వరరావు, వల్లెపు కోటేశ్వరావు, వల్లెపు శ్రీను,బూదాల లక్ష్మయ్య, షేక్ నాగూరు, పి స్వామి, పాలడుగు లక్ష్మణరావు, రమేషు, తాని చింతల దాసు, పందుల అశోక్, షేక్ రఫీ, జ్యోతి, సిహెచ్ వెంకటేశ్వర్లు, అచ్చుకట్ల మార్తమ్మ, బూదాల నాగరాణి, ఖమ్మం పాటి మార్తమ్మ, బక్కా కొండమ్మ, రమావత్ గురవమ్మ, వేల్పుల కోటేశ్వరమ్మ, పి.శారమ్మ తదితరులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.(Story :మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాల అమలు చేయాలి : ఎఐటియుసి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!