మండల స్థాయి చెకుముఖి సైన్స్ టాలెంట్ టెస్ట్
ప్రథమ స్థానం సాధించిన కాకతీయ విద్యానికేతన్ స్కూల్ విద్యార్థులు
కాకతీయ పాఠశాల కరస్పాండెంట్ నిర్మలాదేవి
న్యూస్ తెలుగు / ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా)
ధర్మవరం పట్టణంలోని స్థానిక ఎన్జీవో హోమ్ లో జరిగిన జన విజ్ఞాన వేదిక చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ నందు మండల స్థాయిలో ప్రైవేట్ స్కూల్ విభాగంలో ధర్మవరం పట్టణానికి చెందిన కాకతీయ విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు ప్రథమ స్థానం ను కైవసం చేసుకున్నారని కాకతీయ విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ సెట్టిపి నిర్మలాదేవి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మండల స్థాయిలో ప్రైవేట్ పాఠశాలల విభాగంలో దాదాపు 20 ప్రైవేటు పాఠశాలలు పాల్గొనగ, కాకతీయ విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు లిఖిత, అంజుమ్, జస్వంత్ రెడ్డి 40 మార్కులు గాను 34 మార్కులు సాధించి చెకుముకి టాలెంట్ టెస్ట్ లో ప్రథమ స్థానంలో నిలిచి, జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించడం హర్షినియమని, అభినందనీయమని పాఠశాల కరస్పాండెంట్ శెట్టిపి నిర్మలా దేవి, డైరెక్టర్లు శెట్టిపి సూర్య ప్రకాష్ రెడ్డి , శెట్టిపి పద్మ, ఉపాధ్యాయ బృందం విద్యార్థులను ప్రత్యేకంగా అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. (Story : మండల స్థాయి చెకుముఖి సైన్స్ టాలెంట్ టెస్ట్ )