పొలం పిలుస్తోంది కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగం
మండల వ్యవసాయ అధికారి ముస్తఫా
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : ప్రభుత్వం ఏర్పాటు చేసిన పొలం పిలుస్తోంది అనే కార్యక్రమం రైతులందరికీ అనేక రకాలుగా ఉపయోగపడుతుందని మండల వ్యవసాయ అధికారి ముస్తాఫా పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని చిగిచెర్ల ,ఉప్పు నేసినపల్లి గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం ను నిర్వహించారు. ఈ గ్రామాలలో వ్యవసాయ శాఖ , అనుబంధ శాఖలు మరియు కెవికె శాస్త్రవేత్త కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది అని తెలిపారు. చిగిచెర్ల గ్రామంలో రైతు రాఘవరెడ్డి , కంది పంటలో “పొలం పిలుస్తోంది కార్యక్రమం “నిర్వహించడం జరిగింది అని పలు విషయాలను రైతులకు తెలియజేయడం జరిగిందన్నారు. కంది పంట పూత పిందెదశలో ఉంది అని,ఈ దశలో పచ్చపురుగు ఆశించడం గమనించడం జరిగిందన్నారు. పురుగు నివారణ కోసం ఇమామెక్టిన్ బెంజోయేట్ 100 గ్రాములు ఎకరాకు. మరియు 19-19-19 ఒక కేజీ ఎకరాకు బోరాన్ 0.50, కేజీ ఎకరాకు మొగ్గ విడిచిన తర్వాత పిచికారి చేసుకోవాల్సిందిగా సూచించడం జరిగిందన్నారు. అలాగే ఉప్పునేసిన పల్లి లో వేరుశనగ పంట పొలాలు పరిశీలించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పు నేసిన పల్లి సర్పంచ్ ముత్యాలప్ప నాయుడు , చిగిచెర్ల ఓబిరెడ్డి ,రాఘవరెడ్డి, సిరికల్చర్ టెక్నికల్ ఆఫీసర్ బాబయ్య వీహెచ్ఏ భార్గవ్, ఏ ఈ ఓ అశ్విని ,పశువైద్యులు శేఖర్ , ఏపీ సీఎం ఎఫ్ కోఆర్డినేటర్ ఆదినారాయణ, రైతులు శిల్ల ఆనంద, గణేష్ రెడ్డి, రవిప్రకాష్, ఆనంద, శ్రీనివాసులు, తదితర రైతు సోదరులు పాల్గొన్నారు. (Story : పొలం పిలుస్తోంది కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగం)