3 నుంచే దసరా సెలవులు
న్యూస్ తెలుగు/అమరావతి : దసరా సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందు అనుకున్న ప్రకారం కాకుండా..ఈనెల 3వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభంకానున్నాయి ఈ ఏడాది అక్టోబర్ 12వ తేదీన దసరా పండుగ రానుంది. ఈ క్రమంలో పాఠశాలలకు దసరా సెలవులను ప్రభుత్వం ఇచ్చింది. ఈనెల 3వ తేదీ గురువారం నుంచి 13వ తేదీ ఆదివారం వరకు సెలవులను ప్రకటించారు. ఈ మేరకు పాఠశాల విద్యా సంచాలకులు వి.విజయరామరాజు మంగళవారం ఉత్తర్వులు జారీజేశారు.మొత్తం 10 రోజుల పాటు పండగ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తిరిగి ఈనెల 14వ తేదీ సోమవారం పాఠశాలలు పున:ప్రారంభమవుతాయి. రాష్ట్రంలో అన్ని ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లకు ఈ నిర్ణయం వర్తించనుంది. (Story : 3 నుంచే దసరా సెలవులు)