అభివృద్ధి కాలేదు ఉన్నరోడ్లు పాడయ్యాయి
30వ వార్డు ప్రజల ఆవేదన
న్యూస్‌తెలుగు/వనపర్తి : అభివృద్ధి కాలేదు కానీ అవినీతివలన ఉన్నరోడ్లు పాడయ్యాయి. మాగోడు ఎవరు తీరుస్తారు అంటూ 30వ వార్డు ప్రజల ఆవేదన తెలిపారు.ఐజయ్య కాలనీలో రోడ్ నెంబర్ 4 దగ్గర ఒక అక్రమ పర్మిషన్తో అపార్ట్మెంట్ కట్టి చుట్టుపక్కల రోడ్డు,కాలువలను ధ్వంసం చేస్తే నాలుగు సంవత్సరాలుగా పట్టించుకోకుండా వారికి కొమ్ము కాస్తూ, ఆ పాడైన రోడ్డును, కాలువలను పట్టించుకోలేదని మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ అన్నారు. రాజకీయ దురుద్దేశంతో రెండు పెద్ద ఊర్ల కంటే ఎక్కువగా మెయిన్ రోడ్డుకు దూరంగా ఏర్పాటు చేసిన 30వ వార్డు.వార్డు అభివృద్ది చేయకుండా, వార్డుకు అన్యాయం చేసిన ప్రజలను మభ్యపెట్టి అధికారం అడ్డు పెట్టుకొని గెలిచిన మాజీ వైస్ చైర్మన్ , గెలిచిన తర్వాత వార్డును పట్టించుకోలేదు ఎందుకని, 30 వ వార్డు ప్రజలు గగ్గోలు పెడుతున్నారు అన్నారు వార్డులో పర్యటించిన మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ త్వరలో వార్డ్ మొత్తం పరిశీలించి వార్డు సమస్యలను ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి గారి దృష్టికి, మరియు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వార్డు సమస్యలను పరిష్కరించే దిశగా పాటుపడతానని ప్రజలకు హామీ ఇచ్చారు.(Story:అభివృద్ధి కాలేదు ఉన్నరోడ్లు పాడయ్యాయి)