Homeవార్తలు 'శ్వాగ్' ట్రైలర్ రిలీజ్

 ‘శ్వాగ్’ ట్రైలర్ రిలీజ్

 ‘శ్వాగ్’ ట్రైలర్ రిలీజ్

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా: కంటెంట్ కింగ్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి ‘రాజ రాజ చోర’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యూనిక్ ఎంటర్‌టైనర్‌ ‘శ్వాగ్’ తో అలరించడానికి రెడీ అయ్యారు.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరో 4 రోజుల్లో సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా, మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

1551 నుంచి మగవాడి ప్రయాణం అంటూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. స్వాగనిక రాజవంశంలో ప్రతి రాజు మగ వారసుడిని కలిగి ఉండాలని కోరుకుంటాడు. అయితే, 1970ల నుండి ఈ వంశానికి చెందిన యయాతి సాదాసీదా జీవితాన్ని గడుపుతాడు. అతనికి కుమార్తెలు మాత్రమే వుంటారు. మరొక యుగానికి చెందిన భవభూతి,  సింగ తన వారసుడిని తెలుసుకుంటాడు. రాజవంశం నిధిని అప్పగించడం అతని బాధ్యత. అయితే, వింజమర రాణి దిన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది.

విభిన్న టైమ్‌లైన్‌లలో సెట్ చేయబడిన కథ, జెండర్ గేమ్స్ ని ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ప్రజెంట్ చేసింది. దర్శకుడు హసిత్ గోలి ఈ ట్రైలర్ ద్వారా ప్లాట్‌ను క్లారిటీ, ఇన్ సైట్ తో అందించారు. శ్రీవిష్ణు 4  డిఫరెంట్ గెటప్‌లలో అద్భుతమైన నటన కనబరిచారు. భిన్నమైన బాడీ లాంగ్వేజ్, డిక్షన్, గెటప్ లతో అలరించారు. భవభూతి పాత్ర ఎక్స్ ట్రార్డినరీ గా వుంది.

రీతూ వర్మకు ఇంపార్టెంట్ క్యారెక్టర్లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. మీరా జాస్మిన్ తన రీఎంట్రీలో చేస్తున్న చిత్రంలో చాలా కీలక పాత్రను పోషించింది. దక్ష నగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్ తమ పాత్రలతో ఆకట్టుకున్నారు.

ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్,  ఫన్ అన్నీ ఎలిమెంట్స్ అద్భుతంగా వున్నాయి. వేదరామన్ శంకరన్  బ్రిలియంట్ సినిమాటోగ్రఫీ, వివేక్ సాగర్  ఎక్స్ లెంట్ స్కోర్‌తో  ట్రైలర్ ని మరింతగా ఎలివేట్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నంతగా వున్నాయి. జిఎం శేఖర్ ఆర్ట్ డైరెక్టర్ కాగా, నందు మాస్టర్ స్టంట్ డైరెక్టర్.

అక్టోబ‌ర్ 4న విడుద‌ల కానున్న ఈ సినిమా, ఎంటర్‌టైన్‌మెంట్ అల్టిమేట్ డోస్ ట్రైల‌ర్‌తో అంచ‌నాలని మరింతగా పెంచింది.

నటీనటులు: శ్రీవిష్ణు, రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ

సాంకేతిక సిబ్బంది:
నిర్మాత:  టి.జి. విశ్వ ప్రసాద్
రచన & దర్శకత్వం : హసిత్ గోలి
సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల
క్రియేటివ్ ప్రొడ్యూసర్: కృతి ప్రసాద్
సినిమాటోగ్రాఫర్: వేదరామన్ శంకరన్
సంగీతం: వివేక్ సాగర్
ఎడిటర్: విప్లవ్ నైషధం
ఆర్ట్ డైరెక్టర్: GM శేఖర్
స్టైలిస్ట్: రజనీ
కొరియోగ్రఫీ: శిరీష్ కుమార్
స్టంట్స్: నందు మాస్టర్
పబ్లిసిటీ డిజైన్స్: భరణిధరన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనునాగవీర
లిరిక్స్: భువన చంద్ర, రామజోగయ్య శాస్త్రి, జొన్నవిత్తుల, నిఖిలేష్ సుంకోజీ, స్వరూప్ గోలి
సౌండ్ డిజైన్: వరుణ్ వేణుగోపాల్
కో-డైరెక్టర్: వెంకీ సురేందర్ (సూర్య)
VFX & DI: దక్కన్ డ్రీమ్స్
కలరిస్ట్: కిరణ్
VFX సూపర్‌వైజర్: వి మోహన్ జగదీష్ (జగన్)
కార్టూన్ అనిమే: థండర్ స్టూడియోస్
డైరెక్షన్ టీం: ప్రణీత్, భరద్వాజ్, ప్రేమ్, శ్యామ్, కరీముల్లా, స్వరూప్
పీఆర్వో: వంశీ శేఖర్ (Story :  ‘శ్వాగ్’ ట్రైలర్ రిలీజ్)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics